YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రచారానికి దూరంగా జగన్

ప్రచారానికి దూరంగా జగన్

విజయవాడ, డిసెంబర్ 5,
నిజమే జగన్ ప్రచారాన్ని పెద్దగా కోరుకోవడం లేదు. అంది వచ్చిన అవకాశాన్ని కూడా జగన్ ఉపయోగించుకోవడం లేదు. చంద్రబాబు మాదిరిగా నిత్యం వార్తల్లో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇది జగన్ కు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనేది చర్చగా మారింది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి పదిహేడు నెలలు కావస్తుంది. ఈ పదిహేడు నెలల్లో జగన్ అనేక సంక్షోభాలను చూశారు. సమస్యలను అధిగమించారు. కానీ ఎక్కడా మితిమీరిన ప్రచారాన్ని కోరుకోవడం లేదు.జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా వైరస్ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అంతటి వారే కరోనా వైరస్ ను వారానికొకసారి ప్రచారంగా మార్చుకున్నారు. జాతినుద్దేశించి ప్రసంగం పేరిట జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కానీ జగన్ కరోనా సమయంలోనూ సమీక్షలకే పరిమితమయ్యారు. అతి కొద్ది సార్లు మాత్రమే మీడియా సమావేశాలు పెట్టారు. అంతే తప్ప కరోనా ను కూడా క్యాష్ చేసుకోవాలని చూడలేదు.ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వరదలు, తుఫానులు అనేకం వచ్చాయి. ఈ సమయాల్లో సమీక్షల పేరుతో జగన్ ఏమాత్రం హడావిడి చేయలేదు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ హడావిడి వేరు. నిత్యం సమీక్షలతో ఆయన గడిపేవారు. హుద్ హుద్ తుపాను సమయంలో అయితే నేరుగా విశాఖకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కానీ జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.నివర్ తుపాను వచ్చినప్పుడు కూడా జగన్ ఎలాంటి ఆర్భాటానికి పోలేదు. తుపాను హెచ్చరికలతో జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ తుపాను సమయంలో పంట నష్టం ఎక్కువగా జరిగింది కాని, ఆస్తి, ప్రాణ నష్టం తక్కువగానే జరిగిందని చెప్పాలి. ఇక సంక్షేమ పథకాలను వరసగా అమలు చేస్తున్నా పెద్దగా ప్రచారాన్ని జగన్ కోరుకోవడం లేదు. అతిగా ప్రచారం అనర్థానికి దారితీస్తుందన్న సూచనలతోనే జగన్ వాటికి దూరంగా ఉంటున్నారని పార్టీ సీనియర్ నేతలు చెబుతుండటం విశేషం.

Related Posts