బీసీ కులాలు అంటే నాకు అమితమైన ప్రేమ అంటూ, మరోపక్కభట్రాజు పొగడ్తలు అనడం ఎంతవరకు సమంజసమని భట్రాజు అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్నా పాటిశ్రీ రామరాజు పేర్కొన్నారు .నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భట్రాజుల కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదన్నారు . జరుగుతున్న శాసనసభ అ సమయాలలో , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఒక శాసనసభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ తో పోల్చడం జరిగిందని, ఆ విషయమై మాట్లాడుతూ భట్రాజులు పొగడ్తలు అనడం సరి కాదని మండిపడ్డారు. కులాలను, మతాలను గౌరవించడం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అని పేర్కొన్నారు .అలా అన్ని కులాలను గౌరవించే మనస్తత్వం మీకు కలగాలని , కులాలను వేలెత్తి చూపే విధంగా మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో బట్టరాజు ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పల జయ రామ రాజు అసోసియేషన్ నాయకులు కే ,మురళి మోహన్ రాజు, లక్ష్మణ్ రాజు, ప్రభాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు .