నెల్లూరులో వరుస ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తంగా మారాయి. జిల్లాలో తడ మండలం రామాపురం జాతీయరహదారిపై సూళ్లూరుపేట నుంచి చెన్నై వైపు వెళుతున్న టిప్పర్ అదుపు తప్పి చెన్నై నుండి వస్తున్న బస్సు ను బలంగా డీ కొట్టింది. దీంతో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడికే మృతి చెందగా బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరో ఘటన నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. సంగం వైపు నుండి బుచ్చి వైపు బైక్ పై వెళ్తున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది .దీంతో యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని కోవూరు కి చెందిన శ్రీహరి గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .