YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సరైన సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి ఆళ్ల నాని

సరైన సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి ఆళ్ల నాని

ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా రాష్ట్రంలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే పరిస్థితులు లేవని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. సరైన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పడు వ్యవహరించాల్సిన తీరుపై స్పష్టమైన నిబంధనలు ఉండేలా ఏపీ పంచాయతీరాజ్‌ యాక్ట్‌–1994లో మార్పులు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు.
రాష్ట్రంలో ఇంకా కరోనా ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పుడే నిర్వహించడం ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రమాదకరమని చెప్పారు. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉందని నిపుణులు, మీడియా ప్రతినిధులు సైతం చెబుతున్నారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు కూడా సెకండ్‌ వేవ్‌ను అడ్డుకోవడానికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల వివరాలను అడుగుతోందన్నారు. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, అసోం రాష్ట్రాల్లో సెకండ్‌ వేవ్‌ సంకేతాలు వస్తున్నాయని తెలిపారు. ఈ తరుణంలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘంతోపాటు మరికొందరు చేస్తున్న వాదనలు సరికాదన్నారు.

Related Posts