YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వై.ఎస్. జగన్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ!

 వై.ఎస్. జగన్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ!

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను వెండితెరపై ఆవిష్కరించడానికి దర్శకుడు మహి వి.రాఘవ్ సన్నాహాలు చేస్తున్నాడు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర .. ఆ యాత్ర చూపిన ప్రభావం .. ఆయనకి విజయాన్ని అందించిన తీరు ఈ సినిమాలో చూపించనున్నారట. అందువలన ఈ సినిమాకి 'యాత్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో రాజశేఖర రెడ్డి పాత్ర మలయాళ స్టార్ హీరో మమ్ముట్టిని ఎంపిక చేసుకున్నారు. ఆయన సతీమణి పాత్రలో నయనతారను ఎంపిక చేసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా రమ్యకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్రకి రమ్యకృష్ణ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి, ఆమెను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో వై.ఎస్. జగన్ పాత్రలో సూర్య చేయనున్నట్టు ఒక వార్త షికారు చేస్తోంది.    

Related Posts