YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

బండి లాగేశారు...

బండి లాగేశారు...

ఏ ముహూర్తాన బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారో గాని బండి సంజయ్ కు వరస విజయాలు దక్కుతున్నాయి. మాటల గారడీ కావచ్చు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావచ్చు. కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలోనూ, ఎంఐఎం తో మైత్రిని సమర్థంగా విన్పించడంలోనూ బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేటర్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి ఎంపీగా గెలిచి బీజేపీలో కీలక నేతగా ఎదిగారు.ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న బండి సంజయ్ ను పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలోనే అధిష్టానం తన చతురతను ప్రదర్శించింది. బండి సంజయ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇది బీజేపీకి ఊహించని విజయమే. అయితే ఈ విజయంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని గ్రహించిన బీజేపీ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకుంది.
గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలైనా ఇన్ ఛార్జిగా యోగేంద్ర యాదవ్ ను బీజేపీ అధిష్టానం పంపినప్పుడే ఈ ఎన్నికలను ఎంత సీరియస్ గా తీసుకున్నదో తెలుస్తుంది. ప్రధానంగా టీఆర్ఎస్ కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ పాగా వేసింది. సికింద్రాబాద్ డివిజన్ లో అన్ని డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది. ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గంలో గత అసెంబ్లీలో గెలిచిన సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ లో చేరారు. ఇక్కడ కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం వెనక బండి సంజయ్ వ్యూహం ఉంది.దీంతో పాటు హిందువుల ఓట్లను సాలిడ్ గా తన వైపునకు తిప్పుకునేందుకు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా కొంత మేరకు ఉపకరించాయని చెప్పాలి. బయటకు రెచ్చగొట్టే వ్యాఖ్యలుగానే కన్పిస్తున్నా ఎంఐఎంను దోషిగా చూపడంలో బండి సంజయ్ సక్సెస్ కాగలిగారు. అమిత్ షాతో సహా కేంద్రమంత్రులందరూ రంగంలోకి ప్రచారంలో పాల్గొనడం కూడా బీజేపీకి ఉపకరించిందనే చెప్పాలి. నాలుగు స్థానాల నుంచి 47 స్థానాలకు బీజేపీ హైదరాబాద్ నగరంలో ఎదగడం బండి సంజయ్ ఇమేజ్ ను పార్టీలో మరింత మెరుగుపర్చిందనే చెప్పాలి. మొత్తం మీద బండి సంజయ్ వరస విజయాలతో సక్సెస్ ను రుచిచూస్తున్నారు.

Related Posts