జగన్ కేబినెట్ లో ఇటీవల చేరిన ఇద్దరు మంత్రుల పనితీరుపై సీఎం నిశితంగా కొన్ని సూచనలు చేసినట్టు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. కొత్తగా తీసుకున్నవారిలో.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీదిరి అప్పలరాజు పరిస్థితి బాగానే ఉందని అంటున్నారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగా ఆయన పనితీరును మెరుగు పరుచుకుంటున్నారని.. నిత్యం తన శాఖ అధికారులతో సమీక్షలు చేయడం.. జిల్లా రాజకీయాల్లోనూ అందరినీ కలుపుకొని పోవడం వంటి విషయాల్లో అప్పలరాజు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జిల్లా విభజన విషయంలో టీడీపీ నాయకులు విమర్శలు చేస్తే.. అప్పలరాజు.. ధీటుగా సమాధానం ఇచ్చారు. జిల్లా అభివృద్ధి చెందలేదని ఎలా చెబుతారని.. అలా అయితే మీరే సిగ్గుపడాలని కౌంటర్ ఇచ్చారు.దీంతో టీడీపీ నాయకులు సైలెంట్ అయిపోయారు. అదే సమయంలో ధర్మాన సోదరులతోనూ అప్పలరాజు మంచి సఖ్యత మెయింటెన్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమూల్ ప్రాజెక్టు విషయంలోనూ.. పాల సహకార సంఘాలను అమూల్ దిశగా నడిపించడంలోనూ మంత్రి సక్సెస్ అయ్యారు. అటు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు అప్పలరాజు పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కావడంతో అక్కడ తన వంతుగా దృష్టిపెట్టడంతో పాటు అచ్చెన్న వ్యాఖ్యలకు కౌంటర్లు కూడా స్ట్రాంగ్‌గానే ఇస్తున్నారు. ఇలా సీదిరి దూసుకుపోతున్న నేపథ్యంలో జగన్ ఈయనపై ప్రశంసలు కురిపించారట.అదే సమయంలో మరో కొత్త మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విషయంలో మాత్రం సీఎం జగన్ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరిజిల్లా రాజకీయాలలో ఇటీవల వైసీపీ దూకుడు ఎక్కువగా ఉండడంతో పాటు అంతర్గత కలహాలు.. కుమ్ములాటలు పెరిగిపోయాయి. అయితే.. ఎప్పటి నుంచో ఉన్న వివాదాలకు తోడు.. కొత్తగా కూడా వివాదాలు ముసురుకోవడం.. ఏకంగా మంత్రి కన్నబాబును టార్గెట్ చేస్తూ.. కొందరు రెచ్చిపోవడం. అదే సమయంలో తోట త్రిమూర్తులను టార్గెట్ చేసుకుని.. జగన్ సర్దిచెప్పిన తర్వాత కూడా ఆయనపై దూకుడుగా వ్యవహరించడం.. వంటి విషయాలను జగన్ సీరియస్‌గా తీసుకున్నారని అంటున్నారు వైసీపీ నాయకులుఇక కోనసీమలో ఇతర నియోజకవర్గాల్లోనూ వేణు వేలు పెడుతున్నారన్న కంప్లెంట్లు ఇప్పటికే జగన్ వద్దకు చేరాయి. ఈ క్రమంలోనే తాజాగా సదరు మంత్రి చెల్లుబోయిన వేణుకు జగన్ గట్టి క్లాసే ఇచ్చారని వైసీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఒకే రోజులో.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేతలను జగన్ లైన్‌లోకి తెచ్చారని ఓ మంత్రి వ్యాఖ్యానించడం పార్టీలో హల్‌చల్ చేస్తోంది. అటు.. బోసు-ద్వారంపూడిలను దారిలోకి తీసుకురావడంతో పాటు.. ఇలాంటి వివాదాల్లో జోక్యం చేసుకుంటున్న చెల్లుబోయినకు చిన్నపాటి చురకలే వేశారట.