YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ధర్మాన యాక్టివ్....

ధర్మాన యాక్టివ్....

శ్రీకాకుళం జిల్లాలో ఒకనాడు ఏకచత్రాధిపత్యంగా అధికారం చలాయించిన నేత ధర్మాన ప్రసాదరావు. యువకుడిగా ఉన్నపుడే శాసనసభ్యునిగా గెలిచిన ధర్మాన నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో యువ మంత్రిగా చోటు సంపాదించారు. ఆయన అసెంబ్లీలో విపక్షంలో ఉన్నా కూడా మంచి సబ్జెక్ట్ తో అధికార పక్షాన్ని ఇరకాటం పెట్టేవారు. నిజానికి శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడు కుటుంబం కంటే ముందే మంత్రి పదవులు సంపాదించడమే కాదు, తనకంటూ ఒక సైన్యాన్ని తయారుచేసుకున్న ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో రాజకీయంగా కొంత వెనకబడ్డారని చెప్పకతప్పదు.వైసీపీలోకి 2014 ఎన్నికల ముందు ప్రవేశించిన ధర్మాన ప్రసాదరావు అప్పట్లో ఓడిపోయారు. ఆ తరువాత జగన్ మీద ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అయ్యాయి. పులివెందులలో జగన్ గెలవడం కాదు, శ్రీకాకుళంలో గెలవాలి అంటూ ఆయన హాట్ హాట్ కామెంట్స్ చేసి జగన్ కన్నెర్రకు గురి అయ్యారు. దాని వల్లనే ఆయన 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయినా కూడా మంత్రి పదవిని సాధించలేకపోయారు. ఇక ధర్మాన ప్రసాదరావు ఈ మధ్య వరకూ అసమ్మతివాదిగానే ఉన్నారు. కానీ అన్న క్రిష్ణ దాస్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ జోరు చేస్తున్నారు. జగన్ ఆయనకు ఏం చెప్పారో, అన్న తమ్ముడిని ఎలా లైన్ లో పెట్టారో కానీ ఇపుడు ధర్మాన ప్రసాదరావు మళ్ళీ ఫుల్ యాక్టివ్ అయ్యారుధర్మాన ప్రసాదరావు తన నియోజకవర్గం శ్రీకాకుళాన్నే అంటిపెట్టుకుని నిన్నటివరకూ ఉన్నారు. ఇపుడు మాత్రం ఆయన జిల్లా అంతటా చుట్టుముడుతున్నారు. కాంగ్రెస్ మంత్రిగా పనిచేసిన రోజుల్లో జిల్లా అంతటా తనకంటూ అనుచరులను సంపాదించుకున్న ధర్మాన ఇపుడు వారులో హుషార్ ని తట్టిలేపుతున్నారు. తాజాగా ఒకే రోజు టెక్కలి, పలాసా, ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్మాన ప్రసాదరావు టూర్లు వేస్తే వైసీపీ శ్రేణులు గ్రూపులు సైతం విడిచిపెట్టి ఏకమొత్తంగా జై కొట్టాయి. ధర్మానకు ఘన స్వాగతం పలికాయి. ఆయన కూడా అందరినీ దగ్గరకు తీసుకుని వైసీపీ బలోపేతం మీద చర్చించారు.మధ్య జగన్ క్రిష్ణదాస్ ని పిలిచి మరీ జిల్లా రాజకీయాల్లో ధర్మాన ప్రసాదరావును యాక్టివ్ కావాలని కోరారట. శ్రీకాకుళం మీద కన్నేసిన జగన్ కి అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కావడంతో గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారుట. దాంతో ధర్మాన ప్రసాదరావు సేవలను వాడుకోవాలని జగన్ నిర్ణయించారని చెబుతున్నారు. ఇక ప్రసాదరావుకు భవిష్యత్తులో మంత్రి పదవి గ్యారంటీ అని అనుచరులు సంబరపడుతున్నారు. వచ్చేసారి విస్తరణలో అన్నకు బదులుగా తమ్ముడిని జగన్ తీసుకుంటారని అంటున్నారు. ఎన్నికలకు సరిపడే విధంగా తన క్యాబినేట్ కూర్పు ఉంటుందని, అపుడు కచ్చితంగా ప్రసాదరావుకి చోటు దక్కుతుందని అంటున్నారు. అందుకే ధర్మాన జిల్లాలో పార్టీని పటిష్టం చేయడానికి కంకణం కట్టుకున్నారని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related Posts