YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

భద్రతా సమస్యలపై చంద్రబాబుతో చర్చించిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్

భద్రతా సమస్యలపై చంద్రబాబుతో చర్చించిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర ఇంటెలిజెన్స్ డైరెక్టర్ రాజీవ్ జైన్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వారిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని భద్రతా సమస్యలు, పోలీస్ వ్యవస్థ గురించి వీరు చర్చించారు. పోలీస్ విభాగం సాధించిన ఘనతలు, మౌలిక వసతుల గురించి జైన్ కు చంద్రబాబు వివరించారు. అనంతరం మంగళగిరిలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు జైన్ వెళ్లారు. డీజీపీ మాలకొండయ్య, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, ఇతర సీనియర్ పోలీస్ అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పోలీసుల కోసం చేపట్టిన ఆరోగ్య భద్రత పథకం, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం, బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ కేసులకు అవార్డులు తదితర అంశాలను జైన్ కు మాలకొండయ్య వివరించారు. వేలిముద్రల నెట్ వర్క్ సిస్టం, వేలిముద్రలు మరియు అరచేతి ముద్రల నెట్ వర్క్, క్రైమ్ రేటును తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ పై రాజీవ్ జైన్ ప్రశంసలు కురిపించారు. గ్రేహౌండ్స్ ఆపరేషన్స్, టెర్రరిస్టులు, మావోయిస్టులను గుర్తించడం తదితర విషయాలపై ప్రశంసించారు.  

Related Posts