YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

గ్రేటర్ లో హంగ్.. టీఆర్ఎస్-ఎంఐఎం హెల్ప్ తీసుకోవాల్సిందేనా..?

గ్రేటర్ లో హంగ్.. టీఆర్ఎస్-ఎంఐఎం హెల్ప్ తీసుకోవాల్సిందేనా..?

తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము సొంతంగా విజయం సాధిస్తామని టీఆర్ఎస్ చెప్పింది. కానీ ఓటర్ల తీర్పు మాత్రం ఇంకో విధంగా ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అసదుద్దీన్ ఒవైసీ రెండు సార్లు మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కేసీఆర్ ను పొగుడుతూ మాట్లాడారు. చూస్తుంటే తమ పార్టీలు రెండూ కలిసి మేయర్ పీఠం మీద ఉండబోతున్నాయనే సంకేతాలని ఇచ్చారు.
మత రాజకీయాలను పులుముతున్న బీజేపీని ఎదుర్కోవాలంటే, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే సమర్థవంతుడైన నేతని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేసీఆర్ ను తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుంచి చూస్తూనే ఉన్నానని, దక్షిణాదిన ఆయన గొప్ప భవిష్యత్ ఉన్న నేతని అన్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ తదితరులు పర్యటించిన డివిజన్లలో బీజేపీ ఓడిపోయిందని అన్నారు.పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న బీజేపీని ప్రజాస్వామ్య యుద్ధంలో ఓడించామని అన్నారు. తాము చాలా తక్కువ సీట్లలోనే పోటీ చేశామని, అయినా తమ సీట్లను నిలుపుకున్నామని అన్నారు. తదుపరి రాజకీయ నిర్ణయాలపై పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని, మేయర్, డిప్యూటీ మేయర్ విషయంలో టీఆర్ఎస్ అధినేతలతో మాట్లాడుతానని అన్నారు. ముస్లింలు, హిందువులు అందరూ ఎంఐఎంకు ఓటు వేశారని.. తమ పార్టీకి వచ్చిన ఫలితాలపై సమీక్ష జరుపుతున్నామన్నారు. గ్రేటర్‌లో బీజేపీ గెలుపు తాత్కాలికమేనని, దాని ప్రభావం రాష్ట్రంలో ఉండదని అన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై ఎనలేని గౌరవం ఉందని.. కాంగ్రెస్‌, టీడీపీ బలహీనపడటం వల్లే బీజేపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు.

Related Posts