పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో సోమవారం ఉదయం సీఎం,వైఎస్ జగన్ పర్యటన పార్రంభించారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అస్వస్థతకు గురై ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నబాధితులను సీఎం పరామర్శించారు. నేరుగా వార్డ్ లోకి వెళ్లి బాధితులతో మాట్లాడారు. రోగుల వద్దకు వెళ్లి వారి పడుకుని ఉన్న మంచంపై కూర్చుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు, చిన్నారులు, వారి తల్లిదండ్రుల వద్ద నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ వెంట మంత్రులు ఆళ్ల నాని,పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. తరువాత అయన జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవరపల్లికి చేరుకొని గోపాలపురం ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్కు సీఎం జగన్ హాజరు అయ్యారు. ఏలూరులో పలువురు తలతిరుగుడు, వాంతులు, మూర్ఛ వంటి పలు అనారోగ్యాలతో ఒకేసారి వందలాది మంది అస్వస్థతకు గురైనవిషయం తెలిసిందే. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఏలూరులో పర్యటన జరిపారు.