YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

గోవును పూజిస్తే తల్లిని పూజించినట్టే టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి

గోవును పూజిస్తే తల్లిని పూజించినట్టే టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి హిందూ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గుడికో గో మాత కార్యక్రమం సోమవారం ఉదయం  ప్రారంభమైంది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రమణ దీక్షితులు, తిరుమల తిరుపతి సలహాదారులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గోవులను పెంచాలనే ముఖ్య ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమం ప్రారంభించాం అన్నారు. దాతలు కూడా ముందుకు వచ్చి టీటీడీ, హిందు ప్రచార పరిషత్ కి గోవులు అందజేయాలన్నారు.
వైవీసుబ్బారెడ్డి మాట్లాడుతూ  ప్రతి ఆలయంలో ఒక గోవును కచ్చితంగా పూజించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల నుంచి గోవులను తీసుకువచ్చి అమ్మవారికి ఇచ్చామని తెలిపారు.

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పీఠాధిపతి ఆధ్వర్యంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలలో గోవులను అందిస్తామన్నారు. భక్తులు గోవులను దానము చేయాలనుకునేవారు తిరుమల తిరుపతి దేవస్థానానికి గోవులను దానం చేయాలని కోరారు. గోవు సంరక్షణకు నిమిత్తము ఆలయ అధికారులు పూర్తి బాధ్యత వహించాలన్నారు.

కార్యక్రమంలో  బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యే జోగి రమేష్, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, జేఈవో బసంత్ కుమార్, రమణ దీక్షితులు, దుర్గ గుడి ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు, తదితరులు ఉన్నారు.

Related Posts