ఓ పక్క ఆచార్య సినిమా షూటింగ్.. మరోపక్క నిహారిక పెళ్లి వేడుకలు.. ఇంత బిజీగా ఉన్నప్పటికీ అగ్ర కథానాయకుడు చిరంజీవి, సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ నాయుడుని కలిశారు. కొన్ని రోజులు గా రామ్మోహన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరు పరామర్శించేం దుకు స్వయంగా ఆయన ఇంటికెళ్లారు.రామ్మోహన్, కుటుంబ సభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. అంతేకాదు స్వస్థత చేకూరేందుకు అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఏఐజీ హాస్పిటల్స్ యాజమా న్యంతో మాట్లాడి, మెరుగైన చికిత్సకు ఏర్పాట్లు చేస్తానని ఈ సందర్భంగా చిరు అన్నట్లు తెలిసింది. రామ్మోహన్ నిజాయతీగల పాత్రికేయుడని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. చిరు ప్రజారాజ్యం పార్టీ కోసం రామ్మోహన్ పనిచేశారు. ఆయన సేవను గుర్తు పెట్టుకుని, క్లిష్ట సమయంలో ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు.