YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

ఢిల్లీ రైతు పోరాటాలకు మద్దతుగా నిలవాలి-కోరుట్ల వామపక్ష పార్టీల నాయకులు

ఢిల్లీ రైతు పోరాటాలకు మద్దతుగా నిలవాలి-కోరుట్ల వామపక్ష పార్టీల నాయకులు

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా విపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 8న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని
కోరుట్ల వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం కోరుట్ల
పట్టణంలోని సి. ప్రభాకర్ భవన్ లో వామపక్ష పార్టీల నాయకులు
సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, సిపిఐఎం కార్యదర్శి తిరుపతి నాయక్, సిపిఐ యం ,ఎల్ ఎన్ డి ,ప్రజా పంథా చింత భూమేశ్వర్, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు సమావేశం పాల్గొని ఈసందర్భంగా వారు
మాట్లాడుతూ ఐదు రోజులుగా ఢిల్లీలో నవంబర్ నెల 26 నుండి 96 వేల ట్రాక్టర్ తో పంజాబ్, హర్యానా,రాజస్థాన్, మహారాష్ట్ర , మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ , రాష్ట్రం నుండి మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు రకాల చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ సరఫరా బిల్లును నిలుపుదల చేయాలని నిర్వహిస్తున్న రైతుల త్యాగానికి, చైతన్యాన్ని  అభినందించారు. రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర కల్పించక కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయ రంగాన్ని దివాల తీయించి, విదేశీ సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థలకు దేశంలో బడా పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థలకు అప్పగించ వద్దని రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భారత్ బంద్ భాగంగా పట్టణ, వాణిజ్య , వ్యాపార, రవాణా రంగ సంస్థలు బందులో పాల్గొని సహకరించాలని కోరారు. రైతు వ్యతిరేక చట్టాల ను పుస్తక రూపంలో రచించిన బుక్ ను ఆవిష్కరించారు.

Related Posts