నెల్లూరు జిల్లా, కోవూరు మండలంలోని మనస్వి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను గుర్తించిన విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ ,2020 జాతీయ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేసింది . వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన స్వచ్ఛంద సేవా సంస్థలను గుర్తించి, జాతీయ సేవా పురస్కారాలను అందజేస్తున్నామని విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ తాళ్లూరి సువర్ణకుమారి , కన్వీనర్ ఆనంద్ కుమార్ తెలిపారు . కోవూరు చెందిన మనస్వి చారిటబుల్ ట్రస్ట్ పౌండర్ అండ్ చైర్మన్ వై . సదాశివరావు , సభ్యులు తనూజా , రేగూరు సునీల్ కుమార్ , వై.విష్ణునారాయణ , కె.తేజేశ్వరరావు చేస్తున్న సేవలను గుర్తించి జాతీయ సేవా పురస్కారాన్ని అందజేస్తున్నట్లు ట్రస్ట్ చైర్ పర్సన్ సువర్ణకుమారి , కన్వీనర్ ఆనంద్ కుమార్ తెలిపారు . సదాశివరావు బాద్యత కలిగిన జర్నలిస్టుగా ఉంటూ తనతో పాటు సభ్యులను సైతం సామాజిక సేవవైపు మరలించడం మంచి విషయమన్నారు . ఎవరినీ ఏమీ ఆశించకుండా సొంత నిధులతో 10 మంది విద్యార్ధులను దత్తత తీసుకుని పోషించడం అంటే మామూలు విషయం కాదన్నారు . వృద్ధాశ్రయాలు , అనాథశ్రయాల్లో అన్నదానాలు , వస్త్ర దానాలు చేయడం , పేదలకు గుర్తించి వారికి నిత్యాసరాలు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు . కరోనా కాలంలో శానిటైజర్లు పంపిణీ , పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం ప్రశంసనీయమన్నారు . మనస్వి చారిటబుల్ ట్రస్టు జాతీయ ఉత్తమ సేవా పురస్కారం రావడంపట్ల ట్రస్ట్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు . మనస్వి చారిటబుల్ ట్రస్టు జాతీయ ఉత్తమ సేవా పురస్కారం లభించడం పట్ల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హనోక్ తో పాటు తోటి ఉద్యోగులు అభినందనలు తెలిపారు .