YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా గులాబీలతో విన్నూత నిరసన

ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా గులాబీలతో విన్నూత నిరసన

దేశ రాజధాని ఢిల్లీలో  అన్నదాతలు   2 వారాలు నుంచి రైతు వ్యవసాయ  వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి చేస్తున్న  కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఇలాంటి చట్టాలను రద్దు చేసేంత వరకు రైతులకు విద్యార్థులు కూడా మద్దతు గా  నిలుస్తాము అని పీడీస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఓంకార్  తెలిపారు అనంతరం కలెక్టర్ కార్యాలయం నందు ఢిల్లీ లో చేస్తున్న రైతులకు మద్దతు తెలియజేయండి ప్రజలను గులాబీలను ఇచ్చి విన్నూత కార్యక్రమం చేయడం జరిగింది  .ఈ సందర్బంగా మాట్లాడతూ దేశంలో ఉండే రైతులకు హానికరమైన చట్టాలను బీజేపీ ప్రభుత్వం తీసుకొనివచ్చింది అని ఇది కార్పొరేట్లకు లాభం చేకూర్చే లాగా ఉన్నాయి అని అన్నారు అందుకే వ్యవసాయ రంగంలో డైరెక్టగా కార్పొరేట్లకు ధాన్యం కొనుగోలు చేసేటట్లు ఈ చట్టంలో ఉంది అన్నారు అలాగే  విద్యుత్ మీటర్లు పద్ధతి ప్రవేశ పెట్టారు ,రైతులకి పడించే పంట లో గిట్టుబాటు ధర లేకుండా చేసే కుట్రలు దాగి ఉన్నాయి అన్నారు ఈరోజు దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు వారికి బాసటగా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో  ,ప్రముఖులు మద్దతు తెలియజేస్తుంటే మన రాష్ట్రంలో  అధికారంలో ఉన్న జగన్ గారు ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడకపోవడం చాలా బాధాకరం అన్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇటువంటి చట్టాలను రద్దు చేసేంతవరకు రైతుల ఇచ్చే పోరాటాన్ని విద్యార్థులుగా వారికి అండగా ఉంటాము అని తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి, రవితేజ,నాగేష్,చిన్న, విశ్వనాథ్, శివ, మహేశ్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు,

Related Posts