మండల కేంద్రమైన తుగ్గలిలో సోమవారం రోజున స్థానిక వ్యవసాయ కార్యాలయం నందు ఏడిఏ మహమ్మద్ ఖాద్రి వ్యవసాయ శాఖ అధికారులకు రబి ఈ-క్రాప్ బుకింగ్ పై అవగాహన కల్పించారు.తుగ్గలిలో సహాయ వ్యవసాయ సంచాలకులు పత్తికొండ మహమ్మద్ ఖాధ్రి అధ్యక్షతన మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ద్వారా రబీ ఈ- క్రాప్ బుకింగ్ గురించి బహుళ ప్రయోజన విస్తరణ అధికారులు,గ్రామ వ్యవసాయ/ఉద్యాన/పట్టుపరిశ్రమ సహాయకులకు మండల స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో భాగంగా ఏడిఏ వివరిస్తూ రబీ ఈ క్రాప్ బుకింగ్ నమోదు చాలా జాగ్రత్తగా రబీ సీజన్లో విత్తనం వేసిన ప్రతీ రైతును ఆన్ లైన్ లో నమోదు అయ్యేలా చూసుకోవాలని సలహాలు సూచనలు వివరించారు.రబీ ఈ-క్రాప్ బుకింగ్ మొదలైనట్లు గ్రామంలో దండోరా వేయించి, ప్రతీ రైతుకు తెలిసేవిధంగా ప్రచారం చేయాలని తెలియజేశారు.ఈ-క్రాప్ బుకింగ్ పూర్తైన తర్వాత లిస్టు ప్రతీ రైతుభరోసా కేంద్రంలో అతికించి, అతికించిన విషయం దండోరా ద్వారా తెలియజేయాలని,వాలంటీర్ల ద్వారా గ్రామసభ నిర్వహించి అర్హత ఉన్న ఏ రైతు పేరైనా నమోదు కాలేకపోతే ఉన్న సమయం లోపల మరల రెవెన్యూ సిబ్బంది,వాలంటీర్లు మరియు రైతుల సంతకాలు పరిశీలించి ప్రతీ అర్హత గల రైతు పేరు ఖచ్చితంగా నమోదు చేయాలని తెలియజేశారు.ఈ క్రాప్ బుకింగ్ ప్రకారం పంట భీమా,మధ్ధతుధర మరియు విపత్తులు సంభవించినప్పుడు నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందే విధంగా వివరాలు ఉపయోగపడతాయని కావున చాలా జాగ్రత్తగా ఈ క్రాప్ బుకింగ్ చేయాలని తెలియజేశారు. అనంతరం ఏడిఏ మహమ్మద్ ఖాద్రి, ఏవో పవన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా రైతులకు రబీ సీజన్లో ప్రభుత్వ సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను అందజేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ విస్తరణ అధికారులు జిలాన్ భాష,రంగన్న, చైతన్య మరియు మండల పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.