YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గుస్సాతో కటికలపూడి శివ

 గుస్సాతో కటికలపూడి శివ

పార్టీ క‌ష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో చేశాను.. ఎన్నో పోరాటాలు చేశాను.. జిల్లాలోనే తిరుగులేని బంప‌ర్ మెజార్టీతో గెలిచాను.. వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేను.. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఆదేశాల మేర‌కే ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాను.. ఇప్పుడు నేను గుర్తులేనా ? అంటూ ఆ సీనియ‌ర్ నేత చంద్రబాబుపై గుస్సాతో ఉన్నారు.. అల‌క‌పాన్పు ఎక్కేశారు. త‌న‌క‌న్నా జూనియ‌ర్లకు… తాను సీటు త్యాగం చేస్తే గెలిచిన వాళ్లకు ప‌ద‌వులు ఇచ్చిన బాబు గారికి నేను గుర్తులేనా ? అని స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నార‌ట‌. పార్టీపై గుస్సాతో అల‌క‌పాన్పు ఎక్కిన ఆ సీనియ‌ర్ నేత ఎవ‌రో కాదు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే క‌లువ‌పూడి శివ‌. 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాల‌తో పార్టీలో త‌న‌కంటూ క‌లువ‌పూడి శివ‌ ప్రత్యేక‌మైన స్థానం సొంతం చేసుకున్నారు.2014 ఎన్నిక‌ల్లో ఏకంగా 37 వేల భారీ మెజార్టీతో గెలిచిన క‌లువ‌పూడి శివ‌ క్షత్రియ కోటాలో కేబినెట్ లో బెర్త్ ఆశించినా చంద్రబాబు ఊరించి ఊరించి ఇవ్వలేదు. గ‌త ఎన్నిక‌ల్లో చంద్రబాబు బ‌ల‌వంతంతో ఉండి అసెంబ్లీ సీటును త్యాగం చేసి న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ర‌ఘురామ కృష్ణంరాజు చేతిలో ఓడిపోయారు. అయితే ఉండిలో మాత్రం టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు విజ‌యం సాధించారు. తాను ఎంపీగా పోటీ చేయ‌కుండా ఉండి ఉంటే ఖ‌చ్చితంగా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టేవాడిన‌ని క‌లువ‌పూడి శివ‌ ఆవ‌దేన‌.తోడు బ‌ల‌వంతంగా ఎంపీగా పోటీ చేయించి చివ‌ర్లో పార్టీ నుంచి స‌రైన ఆర్థిక స‌హాయం అంద‌లేద‌న్న ఆవేద‌న‌తో పాటు నర‌సాపురం, తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన‌మైన అభ్యర్థుల‌కు సీట్లు ఇవ్వడం కూడా త‌న ఓట‌మి కార‌ణ‌మైంద‌ని క‌లువ‌పూడి శివ‌ ప‌లుసార్లు బాబుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన‌ట్టు టాక్‌. ఈ క్రమంలోనే గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత క‌లువ‌పూడి శివ‌ పార్టీ కార్యక్రమాల‌కు దూరం దూరంగా ఉంటున్నారు. తాజాగా పార్టీ రాష్ట్ర క‌మిటీల్లో క‌లువ‌పూడి శివ‌ను పూర్తిగా ప‌క్కన పెట్టడం ఆయ‌న మ‌రింత ర‌గిలిపోతున్నట్టు తెలుస్తోంది.విచిత్రం ఏంటంటే అదే ఉండి నియోజ‌క‌వ‌ర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన క‌లువ‌పూడి శివ‌ శిష్యుడు మంతెన రాంబాబు, అదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్సీ మంతెన స‌త్యనారాయ‌ణ రాజుకు రాష్ట్ర క‌మిటీలో చోటు ద‌క్కగా శివ‌ను పూర్తిగా ప‌క్కన పెట్టారు. రెండుసార్లు ఎమ్మెల్యే అయిన త‌న‌ను పూర్తిగా విస్మరించ‌డంతో పాటు త‌న‌క‌న్నా జూనియ‌ర్లకు ప‌ద‌వులు ఇవ్వడంతో క‌లువ‌పూడి శివ‌ జీర్ణించుకోలేని ప‌రిస్థితి. శివ శిష్యులు సైతం త‌మ నేత‌ను బాబు ప‌క్కన పెట్టారంటూ ఓపెన్‌గానే ఫైర్ అవుతున్నారు. క‌లువ‌పూడి శివ‌ మౌనం ఉండి నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల‌తో పాటు ప‌శ్చిమ డెల్టాలో ఓ సామాజిక వ‌ర్గంలో ప్రభావం చూపుతుంద‌న్న చ‌ర్చలు కూడా న‌డుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయ‌న రాజ‌కీయ భ‌విష్యత్తు కోసం మ‌రో ఆలోచ‌న చేస్తున్నార‌న్న ప్రచారం కూడా ఉన్నా శివ ఎలాంటి నిర్ణయం తీసుకుంటార‌న్నది మాత్రం ఆస‌క్తిగానే ఉంది.

Related Posts