YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

రంగంలోకి డబ్ల్యూహెచ్వో

 రంగంలోకి డబ్ల్యూహెచ్వో

ఏలూరు ఘటన ప్రజలను, వైద్యులను, ప్రభుత్వాన్ని తెగ టెన్షన్ పెడుతూ ఉంది. ఈ ఘటనకు ఏలూరు మున్సిపాలిటీ పంపిణీ చేసే నీరే కారణమనే ప్రచారం జరుగుతూ ఉండగా.. ఆ నీళ్లు తాగని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా అనారోగ్యానికి గురయ్యారు. వైద్యులు సైతం ఈ అంతుచిక్కని వ్యాధిపై ఏమి చెప్పలేకపోతున్నారు. ఈ అనారోగ్యానికి సంబంధించిన కారణాలను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, నేషనల్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌, ఇండియన్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ టెక్నాలజీ నిపుణులు దర్యాప్తు కోసం ముందుకు వచ్చారు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) సహకారం కోరింది. ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి దర్యాప్తు చేయాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు  ఏలూరుకు చేరుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. రోగులు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అనారోగ్యానికి సంబంధించి, నీటి నమూనాలు, రక్త నమూనాల ఫలితాలు త్వరగా వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రక్త పరీక్షలు, సిటీ స్కాన్‌ రిపోర్టుల్లో సైతం సాధారణంగానే ఉన్నాయని అధికారులు  జగన్‌కు వివరించారు. ఏలూరులో వింత వ్యాధి పై కేంద్రం స్పందించింది. ఏలూరు ఘటనపై అత్యవసర అధ్యయనానికి కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించింది. ఢిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ జంషెడ్ నాయర్ సారథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా పుణే జాతీయ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ నిపుణుడు అవినాశ్ దేవ్, ఎన్సీడీసీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సంకేత కులకర్ణిని నియమించింది. ఈ త్రిసభ్య కమిటీ రేపు ఉదయానికి ఏలూరు చేరుకోనుంది. రేపు సాయంత్రానికి నివేదిక ఇవ్వాలంటూ ముగ్గురు సభ్యులను కేంద్రం ఆదేశించింది.

Related Posts