YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

సాగర్ మరో దుబ్బాక అవుతుందా

సాగర్ మరో దుబ్బాక అవుతుందా

తెలంగాణలో మరో ఎన్నిక అనివార్యమయింది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో మరో ఉప ఎన్నిక తెలంగాణలో జరగనుంది. ఈ ఎన్నికలు ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం. నాగార్జున సాగర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రాజెక్టు అయితే రాజకీయంగా స్పురణకు వచ్చేది జానారెడ్డి. జానారెడ్డి సుదీర్ఘకాలంగా ఇక్కడి నుంచి రాజకీయాలు కొనసాగిస్తూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లో జానా రెడ్డి నోముల నరసింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.నాగార్జున సాగర్ నియోజకవర్గం నియోజకవర్గం 2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడింది. అంతకుముందు చలకుర్తి నియోజకవర్గం నుంచి జానారెడ్డి పోట ీచేసేవారు. 1983 నుంచి వరసగా చలకుర్తిలో పోటీ చేశారు.1994లో మినహా జానారెడ్డి అన్ని సార్లు విజయం సాధించారు. 2009లో చలకుర్తి నియోజకవర్గం రద్దు కావడంతో నాగార్జునసాగర్ నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడి నుంచి 2009, 2014 ఎన్నికల్లో జానారెడ్డి గెలిచారు.
అయితే 1994 ఎన్నికల తర్వాత జానారెడ్డి 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన నోముల నరసింహయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. కేవలం వేయి ఓట్ల తేడాతోనే జానారెడ్డి ఓటమి చెందారు. నోముల నరసింహయ్య మృతితో మరోసారి జరిగే ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. దుబ్బాకలో జరిగిన పరాభవాన్ని నాగార్జున సాగర్ ద్వారా తీర్చుకునేందుకు కాంగ్రెస్ కు అవకాశం లభించింది.ఆరు నెలల్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నా ఇప్పటి నుంచే కాంగ్రెస్ కార్యాచరణ ప్రారంభించే అవకాశాలున్నాయి. జానారెడ్డి పోటీ చేస్తారా? లేక ఆయన తనయుడిని రంగంలోకి దించుతారా? అన్నది తేలాల్సి ఉంది. ఇక అధికార టీఆర్ఎస్ కు కూడా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దుబ్బాకలో తలబొప్పికట్టిన టీఆర్ఎస్ నాగార్జున సాగర్ మరో తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి. ఇక్కడ బీజేపీ కంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.
టీఆర్ఎస్, బీజేపీ ఆఫర్లు
నోముల నరసింహయ్య మృతితో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే టీఆర్ఎస్ పార్టీ జానారెడ్డి కుటుంబాన్ని పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చేందుకు కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడ నోముల నరసింహయ్య కుటుంబం నుంచి ఎవరూ పెద్దగా పోటీ పడకపోవడం, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం రిపీట్ కాకూడదని ఎలాగైనా జానారెడ్డి కుటుంబాన్ని పార్టీలోకి తేవాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది.అదే సమయంలో బీజేపీ కూడా రఘువీర్ రెడ్డి కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టిందంటున్నారు.టీఆర్ఎస్ లోకి వెళితే వంద మందిలో ఒకరుగా ఉంటారని, బీజేపీలో అయితే ప్రధాన భూమిక పోషించవచ్చని బీజేపీ జానారెడ్డి కుమారుడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక వరస ఓటములతో దిగాలుపడిన కాంగ్రెస్ కు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి కుటుంబమే దిక్కు. అందుకే ఆయనను పార్టీ నుంచి వెళ్లకుండా కాంగ్రెస్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. జానారెడ్డి కుమారుడి కోసం మూడు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరి ఆయన ఎటు మొగ్గు చూపుతారో చూడాలి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది ప్రచారంగా కొట్టి పారేస్తుంది.

Related Posts