YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం తెలంగాణ

కరోనా టీకా కోసం రూట్ మ్యాప్

కరోనా టీకా కోసం రూట్ మ్యాప్

కరోనా టీకా రాగానే రోజుకు 10 లక్షల మందికి వేయాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అలా వారం రోజుల్లో 70 లక్షల మందికి వేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇతర టీకాల మాదిరిగా కాకుండా... తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్స్‌ ఇవ్వ డంతోనే కోవిడ్‌–19ను కట్టడి చేయవచ్చు. అందుకు రాష్ట్రంలో ఎంపిక చేసిన 10 వేల మంది ఏఎన్‌ఎంలు, నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఒక్కొక్కరు రోజుకు 100 మందికి టీకా వేస్తారు. అలా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఒకవేళ టీకా ఎక్కడైనా వికటిస్తే తక్షణమే స్పందించేలా నిష్ణాతులైన డాక్టర్లతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తారు. వారికి కూడా శిక్షణ ఇస్తారు. ఇప్పటికే టీకా డ్రైరన్‌ నిర్వహించారు. సాఫ్ట్‌వేర్‌ను సరిచూసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వ ర్యంలోని ఉన్నతాధికారులు వీటిని పరిశీలించి చూశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి టీకాలు రాగానే ప్రాధాన్య క్రమంలో ఇచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మొదటి దశలో రాష్ట్రంలో 70 లక్షల మందికి టీకాలు వేస్తారు. వారిలో 3 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోని డాక్టర్లు, నర్సులు సహా క్షేత్ర స్థాయి ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బం దికి ఇస్తారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులు, ఫ్రంట్‌లైన్‌ కార్మికులు, 50 ఏళ్లు పైబడిన వారు, ఆలోపు వయస్సుండి ఇతరత్రా అనారోగ్య సమ స్యలున్న వారికి టీకాలు వేస్తారు.ఈ మేరకు మొదటి దశ లబ్ధిదారుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ కేంద్రానికి పంపించింది. వ్యాక్సిన్‌ పక్కదారి పట్టకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. టీకాలకు సంబం ధించి వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రతి రోజూ ఉన్నస్థాయి సమీక్షలు చేస్తున్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎప్పుడు టీకా అందుబాటులోకి వస్తుందన్న దానిపై తమకు ఇంకా ఎటువంటి సమాచారం రాలేదని వైద్య ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. అయితే రాగానే వేగంగా వేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపాయి.టీకాలను నిల్వ ఉంచేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక రిఫ్రిజిరేటర్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) 20 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసింది. మిగిలిన జిల్లాల్లోనూ త్వరలో ఏర్పాటు చేస్తారు. అన్ని పీహెచ్‌సీల్లోనూ సాధారణ రిఫ్రిజిరేటర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. 70 లక్షల మందికి సరిపోయే టీకాలను భద్రపరిచే రిఫ్రిజిరేటర్‌ వ్యవస్థ మన వద్ద అందుబాటులో ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిం చింది. ఇవన్నీ మైనస్‌ 20 డిగ్రీలలోపు వరకు సామర్థ్యంతో ఉంటాయి. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా సెకండ్‌ వేవ్‌ నియం త్రణ, వ్యాక్సిన్‌ పంపిణీపైనే దృష్టిసారించింది. ఈ రెండిం టినీ ఒకేసారి నిర్వహించడం ఇప్పుడు మా ముందున్న కీలకమైన సవాల్‌. టీకాను ఎంత వేగంగా ఇస్తే అంత త్వరగా కరోనాను నియంత్రిం చగలం. పైగా రెండు డోసులు ఇవ్వాల్సి ఉన్నందున యాంటీబాడీస్‌ తయా రుకావడానికి సమయం కూడా పడుతుంది. అందువల్ల వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా ప్రజలు మాస్క్‌ పెట్టుకో వాలి.

Related Posts