YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో బంద్ ప్రశాంతం

విశాఖలో బంద్ ప్రశాంతం

కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ తలపెట్టిన భారత్ బంద్ ఏపీప్రభుత్వం మద్దతు ప్రకటించింది. విశాఖలో ఉదయం నుంచే వామ పక్షాలు రోడ్డుపైకి

వచ్చిన ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. పలు చోట్ల సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నేతలు, రైతు సంఘాలు ఆందోళనలకు దిగారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశ

పెట్టిన వ్యవసా య చట్టాలను వ్యతిరేకిస్తూ మద్దిల పాలెం ఆర్టీసీ డీపో వద్ద వామపక్షాలు రాస్తా రోకో నిర్వహించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.కార్పొ రేటు శక్తులను

కాపాడడానికే వ్యవ సాయ చట్టాలను తీసుకువచ్చా రని... రైతులకు మేలు చేయడానికి కాదని  వామపక్ష నేతలు ఆరోపిస్తు న్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టాక రైతులకు మేలు చేసే

ఎటువంటి సంస్కరణలు తీసుకు వచ్చారో చెప్పా లని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేసేవరకు ఈ పోరాటం ఆగదని వామపక్షనేతలు స్పష్టం చేశారు.మద్దిపాలేం వద్ద రోడెక్కి ఆందోళన

వ్యక్తం చేసిన సిపిఐ పార్టీ నేతలు ... కేంధ్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలతో రైతుల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని , ముఖ్యంగా మార్కెటింగ్ విషయంలో కేంధ్ర ప్రభుత్వ తీరు రైతులకు

తీవ్రంగా అన్యాయానికి గురి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.మార్కెటింగ్ యార్డులు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతు న్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి నర్శింగరావు అన్నారు.అదే

విదంగా కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్న చట్టాలను పూర్తిగా రద్దు చేసే వరకూ ఉద్యమాలు కొనసాగుతాయని కేంధ్రానికి ఆల్టిమేటం జారీ చేసిన ఆయన ... రైతుల ఉద్యమాలపై కేంధ్రం

తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.కేంధ్రం తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్ లో రైతు ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉందని,బీజేపీ ఎన్నికల సమయంలో స్వామినాధన్ కమిటీ

నిర్ణయాలను అమలు చేస్తామని చెప్పి , ఇప్పుడు రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై కేంద్రంగా తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.చరిత్రలో ఎన్నడూ లేని విదంగా రైతులు

ధర్నాకు దిగితే ప్రధాని మోదీ వ్యవహరించిన తీరును ఆక్షేపించిన ఆయన ... కేవలం బడా వ్యక్తులకు అను కూలంగా చట్టాలను తీసుకువచ్చారని చెప్పారు.తక్షణమే ప్రభుత్వం దిగి వచ్చి

చట్టాలను పూర్తిగా రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.ప్రతీ రంగాన్ని కార్పోరేట్ పరం చేస్తున్నారని సిపిఐ నేత జే.వి సత్యన్నారాయణ అన్నారు.బీజేపీకి కొమ్ము కాస్తున్న జనసేన పార్టీ కార్పో

రేట్ , రైతుల పక్షాన నిలుస్తున్నారో స్పష్టత ఇవ్వాలని కోరిన ఆయన ... రైతులు వ్యతిరేకిస్తున్న మూడు చట్టాలను తక్షణమే కేంధ్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.బంద్ నేపద్యంలో

పలు వాణిజ్య దుఖాణాలను మూసి వెయ్యాలంటూ ఆందోళన కారులు సముదాయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

Related Posts