కుప్పం నియోజకవర్గంలో రోజురోజుకూ వైసీపీ పట్టుపెంచుకుంటుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబులో ఆందోళన అధికమవుతోంది. వారానికి ఒకరోజు కుప్పం నియోజకవర్గ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తుండటమే ఇందుకు కారణం. కుప్పం నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ ఎంపీ, మంత్రి ప్రత్యేకంగా ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అభివృద్ధి పనులతో పాటు సుదీర్ఘకాలం టీడీపీతో ఉన్న నేతలను వైసీపీ తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది.పదిహేను నెలలుగా చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటించాలనుకునేలోపే కరోనా రావడంతో చంద్రబాబు అటువైపు వెళ్లలేకపోతున్నారు. అక్కడ చంద్రబాబు పీఏగా ఉన్న మనోహర్ మాత్రమే పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు. కరోనాతో నారా కుటుంబం నుంచి కుప్పం వైపునకు వెళ్లకపోవడంతో కొందరు కీలక నేతలు సయితం కండువా మార్చేశారు.ఇక అభివృద్ధి పనుల్లోనూ వైసీపీ వేగం పెంచింది. కుప్పం నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. కురబ, వన్నెకుల క్షత్రియులు ఎక్కువగా ఉన్నా వీరంతా ఇప్పటి వరకూ టీడీపీవైపే ఉన్నారు. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో వీరిని తమవైపునకు తిప్పుకుంటున్నారు. టీడీపీలో కీలకనేతలను ఆకర్షించే పనిని వైసీపీ ఎంపీ రెడ్డప్పకు జగన్ బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. కుప్పం నియోజకవర్గంలో ఏది జరగాలన్నా రెడ్డప్ప కనుసన్నుల్లోనే జరుగుతున్నాయి.నారా లోకేష్ అప్రమత్తమయ్యారు. తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో క్యాడర్ ఇబ్బంది పడుతుండటంతో వారిలో ధైర్యం నింపే ప్రయత్నానికి లోకేష్ పూనుకున్నారు. జనవరి నెలలో కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తానని లోకేష్ సిద్ధమయ్యారు. జనవరిలో దాదాపు మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలోనే మకాం వేసి అక్కడి సమస్యలపై దృష్టి సారిస్తానని లోకేష్ చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పటికిప్పుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించే అవకాశాలు లేకపోవడంతో లోకేష్ కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మరి లోకేష్ పర్యటనతోనైనా కుప్పం టీడీపీ క్యాడర్ లో జోష్ పెరుగుతుందా? లేదా? అన్నది చూడాలి కుప్పం నియోజకవర్గంలో రోజురోజుకూ వైసీపీ పట్టుపెంచుకుంటుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబులో ఆందోళన అధికమవుతోంది. వారానికి ఒకరోజు కుప్పం నియోజకవర్గ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తుండటమే ఇందుకు కారణం. కుప్పం నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ ఎంపీ, మంత్రి ప్రత్యేకంగా ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అభివృద్ధి పనులతో పాటు సుదీర్ఘకాలం టీడీపీతో ఉన్న నేతలను వైసీపీ తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది.పదిహేను నెలలుగా చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటించాలనుకునేలోపే కరోనా రావడంతో చంద్రబాబు అటువైపు వెళ్లలేకపోతున్నారు. అక్కడ చంద్రబాబు పీఏగా ఉన్న మనోహర్ మాత్రమే పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు. కరోనాతో నారా కుటుంబం నుంచి కుప్పం వైపునకు వెళ్లకపోవడంతో కొందరు కీలక నేతలు సయితం కండువా మార్చేశారు.ఇక అభివృద్ధి పనుల్లోనూ వైసీపీ వేగం పెంచింది. కుప్పం నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. కురబ, వన్నెకుల క్షత్రియులు ఎక్కువగా ఉన్నా వీరంతా ఇప్పటి వరకూ టీడీపీవైపే ఉన్నారు. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో వీరిని తమవైపునకు తిప్పుకుంటున్నారు. టీడీపీలో కీలకనేతలను ఆకర్షించే పనిని వైసీపీ ఎంపీ రెడ్డప్పకు జగన్ బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. కుప్పం నియోజకవర్గంలో ఏది జరగాలన్నా రెడ్డప్ప కనుసన్నుల్లోనే జరుగుతున్నాయి.నారా లోకేష్ అప్రమత్తమయ్యారు. తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో క్యాడర్ ఇబ్బంది పడుతుండటంతో వారిలో ధైర్యం నింపే ప్రయత్నానికి లోకేష్ పూనుకున్నారు. జనవరి నెలలో కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తానని లోకేష్ సిద్ధమయ్యారు. జనవరిలో దాదాపు మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలోనే మకాం వేసి అక్కడి సమస్యలపై దృష్టి సారిస్తానని లోకేష్ చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పటికిప్పుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించే అవకాశాలు లేకపోవడంతో లోకేష్ కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మరి లోకేష్ పర్యటనతోనైనా కుప్పం టీడీపీ క్యాడర్ లో జోష్ పెరుగుతుందా? లేదా? అన్నది చూడాలి