కార్తీక మాస దీక్షల్లో భాగంగా బుధవారం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయ ప్రాంగణంలో దుర్గాపూజ - చండీహోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఈ సందర్భంగా పండితులు శ్రీ పవన కుమార శర్మ పూజ విశిష్టతను తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల నుండి మానవాళిని రక్షించాలని స్వామివారిని ప్రార్థిస్తూ టిటిడి హోమాలు, వ్రతాలు నిర్వహిస్తోందన్నారు. దుర్గా పూజ వల్ల దుష్టశక్తుల ప్రభావం తొలగుతుందని, వ్యాధులు దరి చేరకుండా క్షేమం కలుగుతుందని, ధైర్యం చేకూరుతుందని తెలిపారు.
ముందుగా శ్రీ దుర్గాదేవి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. సంకల్పంతో పూజను ప్రారంభించి నైవేద్యం, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.