భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవిడ్-19 వైరస్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ (ముక్కు ద్వారా లోపలికి పంపే) తొలి విడత ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కొవాగ్జిన్‌తో పాటు ఇంట్రా నాసల్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇంట్రానాసల్ టీకా సింగిల్ డేసేనని, వచ్చే నెలలో ట్రయల్స్ ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ట్రయల్స్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని బెంగళూరు బయోకాన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ కిరణ్ మంజుదార్ షాతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో పేర్కొన్నారు. కరోనా వైరస్ కోసం రాబోయే రెండు టీకాలకు తోడు ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్లు అవసరమని కృష్ణ ఎల్లా తెలిపారు.వ్యాక్సిన్లు ఇచ్చేందుకు దేశంలో 2.6 బిలియన్ల సిరంజీలు, సూదులు అవసరమన్నారు. భారత్ బయోటెక్ అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని కరోనా కోసం ‘చింపాజీ అడెనో వైరస్’ కోసం వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ సెయింట్ లూయిస్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ట్రయల్స్ యూనిట్ ఫేజ్-1 ట్రయల్స్‌ను రెగ్యులరేటరీ ఆమోదం పొందిన తర్వాత దేశంలో ట్రయల్స్ కొనసాగించనున్నట్లు తెలిపారు. కోవాక్సిన్ ధర నిర్ణయానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ వ్యాక్సిన్లు చాలా చౌకగా ఉంటాయని చెప్పారు.