YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

16 కోట్లకు చేరిన వస్త్రలత బకాయిలు

16 కోట్లకు చేరిన వస్త్రలత బకాయిలు

విజయవాడలో వస్త్రలత షాపింగ్ కాంప్లెక్సు వ్యవహారం అపరిష్కృతంగా తయారైంది. రికార్డుల పరంగా ప్రస్తుతం వస్తల్రత వ్యాపారులందరూ సుమారు 16 కోట్ల రూపాయల మేర విఎంసికి అద్దె బకాయిలున్నట్టు సమాచారం. ఈ కాంప్లెక్సు నిర్మాణంలో భాగస్వాములైన వ్యాపారులకు 25 సంవత్సరాల లీజు కాలంగా నిర్ణయించారు. అధికారిక రికార్డుల పరంగా కాంప్లెక్సు యాజమాన్య హక్కులు విఎంసికే చెందినా కాంప్లెక్స్‌పై పెత్తనం మాత్రం ప్రైవేటు వ్యక్తులదే దశాబ్దాల తరబడి విఎంసికి ఎటువంటి అద్దె చెల్లించకుండా నెట్టుకురావడమే గాక షాపు లీజు రెన్యువల్స్, సబ్ లీజు వ్యవహారంలో కూడా వస్త్రలత వ్యాపారులదే పై చేయిగా ఉంది. . ప్రస్తుతం ఈలీజు కాలం ముగిసింది. విఎంసి నిబంధనల ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు షాపు లీజు రెన్యువల్ చేసుకోవాలి, లేదా 33.1/3 శాతం అద్దె పెంపుతో లీజు కొనసాగింపు జరగాలి. వీరి లీజు కాలం 25 సంవత్సరాలు ముగిసిన తరువాత లీజు కాలం పెంపు, అద్దె ఖరారులో వ్యాపారులకు, విఎంసి అధికారులకు అభిప్రాయ విభేదాలు తలెత్తడంతో వ్యాపారులు ఒక అసోసియేషన్‌గా ఏర్పడి కోర్టు కెళ్లారు. అయితే కోర్టు విఎంసికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పు వచ్చేంత వరకూ వ్యాపారులు అద్దెలు చెల్లించడం కానీ, లీజు పెంపు కానీ జరగలేదు. కాగా విఎంసి అధికారులు మాత్రం 25 సంవత్సరాల లీజు కాలం ముగిసిన తరువాత వ్యాపారులు చెల్లించాల్సిన అద్దె, వాటిపై అపరాధ రుసుము మొత్తం కలిపి బకాయిగా చూపి చెల్లించాలని సూచించారు. మిగిలిన షాపింగ్ కాంప్లెక్సు వారితో సమానంగా తమకు 33.5 శాతం కాకుండా 15 శాతమే పెంచాలని కూడా మెలిక పెట్టారు. వీటన్నింటికీ చెక్ పెట్టి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు గాను ప్రస్తుత నగర పాలకులతోపాటు వ్యాపారులు కూడా నగర ప్రజా ప్రతినిధులను కలిసి తమ గోడును విన్నవించుకోగా నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం బకాయిగా ఉన్న 14 కోట్లకు గాను 8 కోట్ల రూపాయలు చెల్లించే విధంగానే కాకుండా ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి లీజు రెన్యువల్స్ చేయించుకునే విధంగా ఇరుపక్షాల వారు నిర్ణయానికి వచ్చి ఆ మేరకు ప్రభుత్వానికి నివేదించారు. ఈవిషయంపై ప్రభుత్వం నిర్ణయం ఇంకా ఖరారు కావాల్సి ఉండగా ముందుగా చేసుకున్న నిర్ణయం ప్రకారం 2కోట్ల 60 లక్షల రూపాయలను డిడి రూపంలో విఎంసికి అందించారు. మిగిలిన మొత్తాన్ని వ్యాపారులు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఇదిలావుండగా వ్యాపారులు, నగర పాలకులు కుమ్మక్కై కార్పొరేషన్ ఖజానాకు గండి కొట్టారనే విమర్శలు వెల్లువెత్తాయి. చట్టప్రకారం వసూలు చేస్తే ఖజానాకు 8 కోట్లకు మించి ఆదాయం వస్తుందని, ప్రస్తుత వ్యాపారులను ఖాళీ చేయిస్తే అద్దెరూపంలో ఆదాయం కూడా చాలా పెరుగుతుందనే వాదన వున్నా అధికారులు వ్యాపారులకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. 

Related Posts