YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

దేవాలయాలకు పోస్టల్ సేవలు

దేవాలయాలకు పోస్టల్ సేవలు

ఇతర రాష్ట్రాలలో ఉన్న దేవాలయాల మాదిరిగా ఏపీలో ఉన్న దేవాలయాలకు  పోస్టల్ సేవలు వినియోగించుకుంటామని రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం నాడు అయన పంచారామాలపై పొస్ట్ కార్డును  అయన అవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో ఉన్న అన్ని దేవాలయాలలాగా,   తర్వలో  ఏపీలో ఉన్న దేవాలయాలకు కూడా పోస్టల్ సేవలు వినియోగించుకుంటాం అని, ఒకేసారి వర్చ్యువల్ గా పంచరామాలు దర్శించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రసిద్ధ పంచరామాల  అనగా అమరారామం (అమరావతి), సోమారామం, భీమవరం), క్షీరారామం(పాలకొల్లు) దాక్షారామం మరియు కుమారారామం(సామర్లకోట) ముద్రించిన ఐదు పోస్ట్ కార్డులను మంత్రి అవిష్కరించారు.  అదే విధంగా ఈ సమయానీకి  ఐదు పుణ్యక్షేత్రాలల్లో ప్రత్యేక పోస్ట్ కార్డులను సంబంధిత దేవస్థానము లందు ఆయ పోస్టల్ శాఖ వారు విడుదల చేసారు. ఈ సందర్భంగా మంత్రి హిందూ సంప్రదాయాలు, దేవాలయాలపై పోస్టు కార్డులు ప్రింట్ చేయడం సంతోషకరమని అన్నారు. పోస్టల్ వారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నారన్నారు.  అనంతరం  ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ముత్యాల వేంకటేశ్వర్లు  మాట్లాడుతూ  మహాత్మాగాంధీ 150వ జన్మదినం సందర్భంగా ఏపిలో ఐదు ప్రాంతాలపై పోస్టు కవర్లు రిలీజ్ చేసాం అన్నారు. అదే విధంగా  చారిత్రక ఘట్టాలను డాక్యుమెంట్ చేయడానికి ఫిలాటి అనేది ఒక సాధనం అన్నారు. విజయనగరం శిరిమానోత్సవం పైన కూడా స్పెషల్ కవర్ విడదల చేయడం జరిగిందన్నారు. పంచారామాలకు, సనాతన ఆంధ్ర చరిత్ర కు విడదీయరాని సంబంధం ఉందన్నారు. అమరావతి అతి పురాతన ఆంధ్ర బౌద్ధ సంస్కృతి కి ప్రతీక గా 2వ శతాబ్దం లోను, ఇతర పంచారా మాలు చాళుక్యరాజు భీముడు చేత 9వ శతాబ్దీ లోను నిర్మించారని తెలిపారు. పవిత్ర కార్తీకమాసమునందు ఈ పంచారామాలను ఒకే రోజు దర్శించుకునే ఆనవాయితి ఆంధ్రప్రదేశ్ లో చాలాకాలం నుంచి వున్నది. దీనిని ప్రతిబింబిస్తూ ఈ  పోస్ట్ కార్డ్స్ ను మంత్రి గారి చేత అవిష్కరించడం జరిగిందన్నారు.

విజయవాడ పోస్ట్ మాస్టర్ జనరల్ టి.యం. శ్రీలత  మాట్లాడుతూ, విజయవాడ పోస్టల్ రీజియన్ అనేక ప్రత్యేక కార్యక్రమాలద్వారా విద్యార్థులకు, విద్యార్థుల తలిదండ్రులకు బాగా చేరువైనది. ఫిలా టెలి స్టాంపుల సేకరణను మరింత పెంపొందిం చేందుకు అనేక విద్యాసంస్థలలో విద్యార్థుల ద్వారా ఫిలా టెలి డిపాజిట్ అక్కౌంట్లను తెరచి ప్రజలలో ఫిలాటెలిపై అవగాహనను పెంచారని అన్నారు. కార్యక్రమంలో విజయవాడ రీజియన్ పోస్టల్ డైరెక్టర్ యస్. రంగనాధన్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె.వి.ఎల్.ఎన్. మూర్తి, విజయవాడ పోస్టల్ సూపరింటెండెంట్ కందుల సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related Posts