YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

2019 తర్వాత షిప్ యార్డ్ లో నౌక నిర్మాణాలు

2019 తర్వాత షిప్ యార్డ్ లో నౌక నిర్మాణాలు

విశాఖలోని ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ షిప్‌యార్డుకు మంచి రోజులు వచ్చాయి. కొత్త ఆర్డర్లు రావడంతోపాటు, షిప్‌యార్డు రూపు రేఖలే మారిపోనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం కలిగిన దక్షిణ కొరియాలో హ్యూందాయ్ హెవీ ఇండస్ట్రీస్ సంస్థ టెక్నాలజీతో హిందుస్థాన్ షిప్‌యార్డులో ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్‌ను నిర్మించనున్నామని అన్నారు. ఇందుకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆయన తెలియచేశారు. ఈ మేరకు దక్షిణ కొరియా, భారత ప్రభుత్వాల మధ్య 2015లోనే దీర్ఘకాలిక ఒప్పందాలు జరిగాయని వివరించారు. ఇందులో భాగంగా ఒక నౌక నిర్మాణం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని, రెండేళ్ల కాల వ్యవధిలో ఈ నౌక జల ప్రవేశం చేస్తుందని శరత్ బాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పి-75 కింద యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లను నిర్మించాలని భావించింది. అనివార్య కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. దీంతోనే భారత ప్రభుత్వం, దక్షిణ కొరియా సాంకేతికతను వినియోగించుకునేందుకు ఒప్పందాలు చేసుకుందని శరత్ బాబు చెప్పారు. అలాగే హిందుస్థాన్ షిప్‌యార్డును ప్రపంచ శ్రేణి నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం తీసుకోనున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇదే జరిగితే, దేశంలోని ప్రభుత్వరంగ నౌకా నిర్మాణ సంస్థల్లో హిందుస్థాన్ షిప్‌యార్డు అగ్రభాగాన నిలిచే అవకాశం ఉందన్నారు. ఈ నౌకలతోపాటు 6,000 కోట్ల రూపాయలతో రెండు స్ట్రాటజిక్ ఆపరేటింగ్ నౌకలను నిర్మించనున్నామని చెప్పారు. అలాగే రెండు కేడెట్ ట్రైనింగ్ షిప్స్, ఇండియన్ నేవీ కోసం తొమ్మిది 25టి బొలార్డ్ పుల్ టగ్స్, ఇండియన్ కోస్ట్‌గార్డ్ కోసం ఎనిమిది ఇన్‌షోర్ పెట్రోల్ వెసల్స్‌ని నిర్మించనున్నారు. మొత్తంమీద 2019 తరువాత హిందుస్థాన్ షిప్‌యార్డులో విస్తృతంగా నౌకా నిర్మాణాలు జరుగుతాయని ఆయన ప్రకటించారు., గడచిన 35 ఏళ్లలో తొలిసారిగా హిందుస్థాన్ షిప్‌యార్డుకు లాభాలు వచ్చాయ. 2016-17లో 30 కోట్ల రూపాయల నిర్వహణ లాభాన్ని పొందింది. 625 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించామని, గణనీయంగా పెరిగిన ఆదాయం వల్లే లాభాలు అందుకోగలిగామని పేర్కొన్నారు. 75 ఏళ్లలో ఈ స్థాయలో రెవిన్యూ నమోదు కాలేదన్నారు. ఇక 2015-16లో 19 కోట్ల రూపాయల నికర లాభం నమోదైనప్పటికీ, 45 కోట్ల రూపాయల నిర్వహ ణపరమైన నష్టం వాటిల్లింది. 2015-16లో 593 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించామని తెలియజేశారు. 2014-15లో 294 కోట్ల రూపాయల టర్నోవర్ తోనే సరిపెట్టుకున్నామన్నారు. 

Related Posts