YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

పాలనా భాషగా తెలుగు

పాలనా భాషగా తెలుగు

పాలనా భాషగా తెలుగును అమలు చేయటంలో వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని రాష్ట్ర అధికార భాష అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు.  అనంతపురం జిల్లాలో తెలుగు భాష వాడకం పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అధికార భాష సంఘం అనేది లేకుండా చేశారని పేర్కొన్నారు అధికార భాషా సంఘం అన్ని జిల్లాల్లో పర్యటించి రాష్ట్రంలో పాలనా భాష ఈ విధంగా జరుగుతుందనే అంశంపై అధికారులకు స్పష్టత అందిస్తున్నామని చెప్పారు కార్యాలయ రికార్డుల్లో ఆంగ్ల పదాలకు ప్రత్యామ్నాయంగా వాడటం కోసం పద కోసం మీకోసం అనే పుస్తకాన్ని అధికారులకు అందించినట్లు తెలిపారు ఎప్పుడైనా ఎక్కడైనా కార్యాలయాలను తనిఖీ చేసి పాల నా భాషను వాడుతున్నారా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు ఎలక్షన్ లో ఎటువంటి చర్యలు తీసుకోవడానికి తమకు ఆదేశాలు ఉన్నాయని స్పష్టం చేశారు లేఖలు కార్యాలయ బోర్డులను తెలుగులోనే ఉండేలా చూడాలని చట్టం ఉందన్నారు తెలుగు లేకుండా కార్యాలయాల్లో ఏమి జరగకూడదని అమలు కచ్చితంగా ఉంటుందన్నారు ప్రభుత్వ జీవోలు ఉత్తర్వులను 100% తెలుగులో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు..

Related Posts