YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

బుగ్గారం గ్రామ పంచాయతీ లో అవినీతి రుజువు... ?

బుగ్గారం గ్రామ పంచాయతీ లో అవినీతి రుజువు... ?

బుగ్గారం గ్రామ పంచాయతీ లో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎట్టకేలకు 3నెలలకు విచారణ నివేదిక బయటకు వచ్చింది. బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత-శ్రీనివాస్, ఉప సర్పంచ్ చుక్క శ్రీనివాస్ లతో పాటు పాత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషాలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ పక్షాన షోకాజ్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. బుగ్గారం గ్రామ పంచాయతీ లో నిధులు దుర్వినియోగం అయ్యాయని గ్రామస్తులు గత. ఆగస్ట్ నెలలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. వారి ఫిర్యాదుల మేరకు జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాలతో డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభాకర్ గత సెప్టెంబర్ 17న విచారణ చేపట్టారు. రూ.11,68,803 నిధుల చెల్లింపులపై జగిత్యాల డివిజనల్ పంచాయతీ అధికారి అభ్యంతరాలు తెలుపుతూ జిల్లా పంచాయతీ అధికారికి విచారణ నివేదిక సమర్పించారు. ఆయన నివేదిక ఆధారంగా డిపివో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నోట్ పైల్ అందజేశారు. కలెక్టర్ (పంచాయతీ విభాగం) జగిత్యాల కార్యాలయం నుండి గత నెల అనగా నవంబర్ 27న ఈ షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రభుత్వ మినహాయింపు ల ద్వారా చెల్లింపులు జరిపిన రూ.1,20,313 వెంటనే రికవరీ చేసి ప్రభుత్వ విభాగాలకు జమచేయాలని షోకాజ్ నోటీస్ లలో ఆదేశించారు. అలాగే రాష్ట్ర ఆర్థిక సంఘ నిధులనుండి రూ.4,76,292 మరియు 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి రూ.5,72,198.  మొత్తం రూ.10,48,490 లకు సరైన రికార్డులు, ఆధారాలు, ఎంబీ రికార్డులు, ఉత్తర్వులు, తీర్మాణాలు లేవని, అవేవీ చూపబడలేదని పలు రకాల అభ్యంతరాలు తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 37(1)లో తెలిపిన ప్రకారం సర్పంచ్ తనలో విహితమై ఉన్న అధికారములను, లేదా తన స్థితిని దుర్వినియోగం చేసినారని తెలియుచున్నదని షోకాజ్ నోటీస్ లలో పేర్కొన్నారు. సర్పంచ్ మూల సుమలత, ఉప సర్పంచ్ చుక్క శ్రీనివాస్, పాత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా లను మీపై తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 37(5) నిబంధన మేరకు ఎందులకు చర్యలు గైకొనకూడదో తెలుపాలని షోకాజ్ నోటీస్ లలో సూచించారు. తగు వివరంలతో కూడిన సంజాయిషీలు 15 రోజులలో సమర్పించాలని ఆదేశాలు జారీచేశారు. లేనిచో చట్ట ప్రకారం తగు చర్యలు గైకొనబడునని షోకాజ్ నోటీస్ లలో అధికారులు తెలిపారు. కాగా విచారణ అధికారులు అందజేసిన నివేదిక లో  ఆమోదింపబడిన పలు చెల్లింపుల పై కూడా గ్రామ ప్రజలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పనులు చేపట్టకుండానే తప్పుడు రికార్డులు పెట్టి పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకా తప్పుడు రికార్డులు, దొంగ బిల్లులు అందజేసి ఉన్నతాధికారులను సైతం ప్రక్క దారి పట్టించాలని పాలకులు చూస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెల్లింపులు జరిగిన పనుల పై కూడా బహిరంగ విచారణ చేపట్టాలని, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి లతో పాటు వారికి సహకరించిన అధికారుల పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుగ్గారం గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. లేనిచో తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు.

Related Posts