రాష్ట్ర వడ్డెర కార్మొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద హంగామా చేశారు. టోల్ ఫీజు చెల్లించాలన్న సిబ్బందిపై చేయిచేసుకున్నారు. తననే టోల్ చెల్లించాలంటారా అని సిబ్బందిపై పరుష పద జాలం ఉపయోగించారు. కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను ఆమె స్వయంగా దిగి తొలగించారు. అడ్డగించబోయిన సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తననే ఆపుతావా అంటూ కోపంతో ఊగిపోయారు. అడ్డంగా పెట్టిన బారికేడ్లను తీసువేసి విజయవాడ వైపు వెళ్లారు.