పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బాధితుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని జనసేన ఆరోపించింది. జనసేన పార్టీకి చెందిన వైద్యుల బృందం ఏలూరులో పర్యటించింది. అస్వస్థతకు గురైన వారికి ఎక్స్ పెయిర్ అయిన ట్యాబ్లెట్ల పంపిణీ చేసారని వారు నిర్దారించారు. అత్యధిక కేసులు నమోదైన దక్షిణపువీధిలోని గాంధీ బొమ్మ సెంటర్లలో మెడికల్ క్యాంప్ లో రోగులకు కాలం చెల్లిన మందులు సరఫరా చేసారు. సాక్షాత్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నియోజకవర్గంలో వైద్య శాఖ నిర్లక్ష్యం వుందని బృందం ఆరోపించింది. ఆగస్టు నెలలో కాలపరిమితి ముగిసిన యాంటీ అలెర్జీ మందులను బాధితులకు ఇస్తున్నట్లు గుర్తించారు. జనసేన వైద్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, వెంకటరమణ లు ఈ అంశంపైఆగ్రహం వ్యక్తం చేసారు. ఏలూరు వైద్యాధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా వుందని జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. ఇలాంటి మందులు ఇచ్చి, ప్రజల ప్రాణాలు తీసేస్తారా అంటూ మండిపడ్డారు. ఎక్స్ పెయిర్ అయిన మందులు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.