YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ ఎదురువెళ్తున్నారా...

జగన్ ఎదురువెళ్తున్నారా...

మోడీ అంటేనే మొనగాడు. ఆయన కత్తికి ఎదురులేదు. అడ్డంగా ఎవరు వచ్చినా మోడీ రధం కింద పడాల్సిందే. మోడీని ఢీ కొంటాను అని శపధాలూ సవాళ్ళూ చేసిన ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు చివరికి ఏ రకంగా ఎన్నికల్లో ఓడిపోయారో అంతా చూశారు. ఇపుడు మళ్ళీ మోడీ ప్రాపకం కోసం బాబు పడుతున్న తపన తాపత్రయం చూసిన వారికి ఆ ఫ్లాష్ బ్యాక్ పాలిటిక్స్ ని రిపీట్ చేయాలనిపించదు. మరి ఏపీ సీఎం జగన్ కూడా ఇప్పటిదాకా అలాగే ఉండేవారు. కానీ అకస్మాత్తుగా అతి పెద్ద యూ టర్న్ తీసేసుకున్నారు.మోడీకి మూడు వ్యవసాయ బిల్లులూ ఇజ్జత్ మే సవాల్ లాంటివి. మోడీకి పట్టుదల ఎక్కువ అంటారు. తాను మెచ్చి చేసిన చట్టాలను వెనక్కి తీసుకోవడం అంటే విపక్షం ముందు రాజకీయంగా తాను తగ్గినట్లే అని మోడీ భావిస్తున్నారు. అందుకే ఆయన చట్టాల్లో సవరణలు అంటూ వయా మీడియా మార్గాన్ని సూచిస్తున్నారు. కానీ మొత్తానికి మొత్తం చట్టాలు రద్దు చేయాల్సిందే అని రైతులు, వారి వెనక ఉన్న రాజకీయ పార్టీలు అంటున్నాయి. ఇక భారత బంద్ కి రైతులు పిలుపు ఇస్తే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి.కాంగ్రెస్ కమ్యూనిస్టులకు మోడీ బధ్ధ శత్రువు. ఇక దేశంలోని మమతా బెనర్జీ, అరవింద్ క్రేజ్రీవాల్. లాలూ, ములాయం పార్టీలకు మోడీ అంటే రాజకీయంగా గిట్టదు, ఇపుడు ఆ బ్యాచ్ లో కేసీయార్ కూడా చేరిపోయాడు. సరే కేసీయార్ వ్యవసాయ బిల్లులను ఏకంగా పార్లమెంట్ లో వ్యతిరేకించారు. అలాగే ఆయనకు బీజేపీ రాజకీయంగా ఇపుడు తెలంగాణాలో పెద్ద ప్రత్యర్ధిగా మారుతోంది కాబట్టి భారత్ బంద్ కి సపోర్ట్ చేస్తే ఓకే. కానీ ఏపీలో జగన్ బంద్ కి మద్దతు ఇవ్వడం అంటే అది సంచలన నిర్ణయమే. ఏకంగా ప్రభుత్వమే ముందుడి ఏపీలో బంద్ ని సక్సెస్ అయ్యేలా చూసింది. మరి దీని పరమార్ధం ఏంటన్నదే ఇపుడు రాజకీయ వర్గాల చర్చగా ఉంది.
పొరుగు రాష్ట్రం తెలంగాణాలో బీజేపీ విజయాలు ఏపీలో జగన్ ని కూడా కలవరపెడుతున్నాయి. అందుకే అవకాశం దొరికింది కదా అని ఆయన రైతుల బంద్ కి మద్దతు ఇచ్చి మరీ బీజేపీ మీద తానూ ఒక రాజకీయ రాయి విసిరారనుకోవాలి. ఇక బీజేపీకి అతి ప్రధానమైన రైతుల సెక్షన్ మద్దతు దక్కకుండా చేయాలన్నది కూడా ఒక వ్యూహం. అంతే కాదు, ఎంత మోడీ పట్ల విధేయతగా ఉన్నా ఏపీ విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపిస్తున్నారు అన్న బాధ అసంతృప్తి కూడా కావచ్చు. ఇక ఏపీ బీజేపీ నాయకులు నేరుగా టార్గెట్ చేస్తున్నారు, తిరుపతి ఉప ఎన్నికలో తొడగొట్టి గెలుస్తామంటూ జబ్బలు చరుస్తున్నారు, ఇవన్నీ మనసులో ఉండబట్టే సరైన సమయంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అంటే మోడీని దేశంలోని విపక్షమంతా ఇబ్బంది పెడుతున్న వేళ తానూ ఆ శిబిరంలోకి తెలిసే చేరాడన్న మాట. మరి దీన్ని మోడీ ఎలా చూస్తారో తెలియాలి. ఏది ఏమైనా జగన్ బీజేపీ నుంచి కొంత దూరం జరిగారు అనుకోవాలేమో.

Related Posts