YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

కాంగ్రెస్ కు స్టాలిన్ బ్రేక్

 కాంగ్రెస్ కు స్టాలిన్ బ్రేక్

తమిళనాడులో కాంగ్రెస్ కు కష్టాలు తప్పేట్లు లేవు. డీఎంకే తో కలసి కొనసాగాల్సిందే. అంతకు మించి వేరే దారిలేదు. సొంతంగా పోటీ చేసి గెలిచే సత్తా కూడా లేదు. అయితే ఇప్పుడు డీఎంకే కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు ఇస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. తమిళనాడు కాంగ్రెస్ నేతలు మాత్రం ఎక్కువ స్థానాలను కోరుకుంటున్నారు. దాదాపు అరవై స్థానాలను వారు ఆశిస్తున్నారు. గతం కంటే తాము ఇప్పుడు పుంజుకున్నామని, ఎక్కువ స్థానాలను ఇవ్వాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలను ఇచ్చేందుకు డీఎంకే సుముఖంగా లేదు. గత ఎన్నికల్లోనే 41 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసి కేవలం ఎనిమిది స్థానాల్లోనే విజయం సాధించింది. గత ఎన్నికల్లో గెలిచిన ఎనిమిది సిట్టింగ్ స్థానాలను మాత్రం కాంగ్రెస్ కు ఇస్తామని డీంఎంకే ఇప్పటికే ప్రకటించింది. అంటే కాంగ్రెస్ కు ఇరవై స్థానాల లోపే ఇవ్వాలన్నది డీఎంకే నిర్ణయంగా ఉంది. అంతకు మించి ఎక్కువ ఇవ్వడం కష్టమని తేల్చి చెప్పనుంది.అయితే తమిళనాడు కాంగ్రెస్ నేతలు ఇందుకు సుముఖంగా లేరు. ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి పట్టుపెంచుకోవాలని భావిస్తున్నారు. ఇటీవల రాహుల్ గాంధీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఇదే విషయాన్ని వారు కుండబద్దలు కొట్టారు. అయితే రాహుల్ గాంధీ కూడా స్టాలిన్ నిర్ణయం కోసం వేచి చూడాలని మాత్రమే చెప్పారట. డీఎంకేతోనే కలసి వెళ్లాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణను ప్రకటించాలని రాహుల్ కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలో ఇటీవల దినేష్ గుండూరావు స్టాలిన్ ను కలసి చర్చించారు. అయితే ఎన్ని స్థానాలను ఇచ్చేదన్న విష‍యంపై స్టాలిన్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే మరో బీహార్ లా తమకు నష్టం కలిగించవద్దని మాత్రం స్టాలిన్ నిర్మొహమాటంంగా ఆయనకు చెప్పడంతో ఎక్కువ స్థానాలు దక్కవని కాంగ్రెస్ నేతలకు అర్థమయింది. చివరి అస్త్రంగా రాహుల్ గాంధీ వచ్చి స్టాలిన్ తో చర్చలు జరపాలని కోరడంతో ఆయన అంగీకరించారని తెలిసింది. రాహుల్ ను స్టాలిన్ ఒప్పించగలుగుతారా? లేక రాహుల్ తమకు అవసరమైన సీట్లను సాధిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

Related Posts