త్వరలోనే వివాహం జరగాల్సిన ఆ ఇంట్లో విషాదం నెలకొంది. ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లికి కావల్సిన ఆర్ధిక వనరులు లేకపోవడం ఈ విషాదానికి కారణం. ఈ
ఘటన ఖమ్మం లో జరిగింది. ఖమ్మం నగరంలోని గాందీచౌక్ రాఘవ థియేటర్ సమీపంలో నివాసం వుంటున్న ప్రకాష్ స్థానికంగా ఒక దుకాణంలో పని చేస్తున్నాడు. భార్యల గోవిందమ్మ
(49), కూతుళ్లు రాధిక (29),రమ్య (28)లు. తల్లి, ఇద్దరుకూతుర్లు ఇంటిదగ్గరే టైలరింగ్ చేసుకుంటున్నారు. ఇటీవలే పెద్ద కూతురు రాధికకు పెళ్లి కుదిరింది. కట్నం లేకుండానే పెళ్లి
కుదిరింది. అయితే, పెళ్లి ఖర్చులు భారమయ్యాయి. పెళ్లి తేదీ దగ్గరపడడం, చేతిలో డబ్బులు లేకపోవడంతో వారు ముగ్గురు కలత చెందారు. బుధవారం రాత్రి రసాయనం తాగి తనువులు
చాలించారు. రాత్రి భర్త ప్రకాష్ ఇంటికి వచ్చే సరికి ముగ్గురు విగతజీవులుగా పడివున్నారు. విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు.