మహిళల వ్యక్తిగత సమాచారం బయటకు రాకుండా కేసులు పరిష్కరించేలా విశాఖ పోలీసులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. విశాఖలో వుమెన్ ఇన్ నీడ్ విన్ అనే ఫోరంతో మహిళల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించేలా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఉమెన్ ఇన్ నీడ్ పోస్టర్ రిలీజ్ చేసిన అడిషనల్ డీసీపీ అజితా వేజెండ్ల ... ఈ ఫోరం అంశాలను వివరించారు. వుమెన్ ఇన్ నీడ్ ఫోరమ్ లో ముగ్గురు కమిటీ సభ్యులు ఉంటారని,రెవెన్యూ, జీవీఎంసీ, పోలీస్ శాఖల నుండి ముగ్గురు అధికారులు ఈ కమిటీలో స్ధానం కల్పించినట్లు తెలిపారు.భార్యాభర్తల మధ్య వివాదాలు, స్నేహితులు పరిచయస్తులు మధ్య బాంధవ్య సమస్యలు, మహిళలను వేధింపులకు గురి చేసే కేసులను ఈ ఫోరమ్ లో పరిష్కరిస్తామని చెప్పారు.ప్రతి మంగళ గురువారాల్లో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో కమిటీ సభ్యులు ఇలాంటి కేసులను స్వీకరిస్తారని,దీనికి ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఈ ఫోరం నీ సంప్రదించేలా ఏర్పాటు చేసినట్లు వివరించారు.కార్యక్రమం లో పాల్గొన్న దిశా ఏసీపీ ప్రేమ్ కాజల్, ఈస్ట్ ఏసీపీ హర్షిత పాల్గోన్నారు.