స్థానిక నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ స్వామిరెడ్డి భవన్ సీపీఐ పార్టీ కాయాలయం నందు గురువారం ఉదయం 11 గంటలకు కర్నూలు సర్కిల్ నంద్యాల డివిజన్ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు శ్రీ కె. రామక్రిష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమవేశమునందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పొన్నా శివయ్య మాట్లాడుతూ విద్యుత్ చట్ట సవరణ 2020 బిల్లును ఉపసంహరించుకొవాలని ఈ బిల్లు ద్వారా విధ్యుత్ సంస్థలను కార్పోరేట్ శక్తులకు బదలాయించడం కోసం తీసుకొస్తున్న ఈ బిల్లును ఉపసంహరించుకొవాలని కోరారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నలు గత 12 రోజులుగా గడ్డ కట్టే చలిలో ఢిల్లి సివారుల్లో ఉద్యమం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులు, విద్యుత్ చట్ట సవరణ బిల్లులు మరియు కార్మిక చట్టాల సవరణ బిల్లులను ఉపసంహరించుకొవడం లేదని విమర్శించారు , రైతులు చేస్తున్న డిమాండ్లను కార్మికుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమవేశంలో ఎ పి ఎలెక్ట్రిసిటి స్టాఫ్ & వర్కర్ యునీయన్ నంద్యల డివిజన్ అధ్యక్షులు శ్రీ యన్ మల్లికార్జున రెడ్డి , ఎ ఐ టి యు సి నంద్యాల నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ డి శ్రీనివాసులు మరియు ఎ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి శ్రీ ప్రసాద్ మరియు కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.