విశాఖలో జీవిఎంసీ అధికారులు దూకుడు పెంచారు. ఏళ్లుగా అనధికారకంగా ఉంటున్న నిర్మాణాలు,ఆక్రమణపై దృష్టి సారిస్తున్నారు.స్మార్ట్ సిటీలో ఎక్కడా ఆక్రమణలు ఉండకూదని ప్రభుత్వ ఆదేశాల నేపద్యంలో నగర పరిధిలో గత కొంత కాలంగా ఆక్రమణలను తొలగించిన అధికారులు, తాజాగా రీడింగ్ రూమ్ సమీపంలో ఉన్న నిర్మాణాలను తొలగించారు. దేవాలయం సమీపంలో గత కోన్నేళ్లుగా కొంతమంది అనధికారకంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వీటిపై పలు మార్లు నోటీసులు ఇచ్చిన స్పందించకపోవడంతో నేరుగా రంగంలోకి దిగిన అదికారులు వాటిని తొలగించారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.