దీపం ఉండగానే ఇల్లు సక్కదిద్దుకోవాలి అనే సామెతను.. పీఏ పదవి ఉండగానే.. ఆస్తులు వెనకేసుకోవాలి అన్నట్లు మార్చారట చంద్రగిరి ఎమ్మెల్యే పీఏలు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక.. చెవిరెడ్డి భాస్కర రెడ్డికి బాధ్యతలు కూడా పెరిగాయి. ప్రభుత్వ విప్ గా.. టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఉన్నారు. అలాగే వేరే పదవులు కూడా ఉన్నాయి. దీంతో.. ఆయనపై వర్క్ ప్రెజర్ పెరిగింది. మామూలుగా అయితే.. ప్రజలకి రెస్పాండ్ కావడం.. వారి పనులు చూడడం అనే విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా ముందుంటారు. ఇప్పుడు బిజీ కావడంతో ఆరుగురు పీఏలను పెట్టుకుని.. ఆరు మండలాలకు ఇంచార్జ్ లుగా చేసి పనులు చూసుకోమన్నారట.ఇక పార్టీ కేడర్ కి కూడా వాళ్లనే కలవండి అని చెప్పారట. ఇంకేముంది.. లీడర్లు కూడా పీఏలనే కలవాల్సి వచ్చింది. వీరిలో ఓ పీఏ మాత్రం చాలా స్పీడ్ అంట. పనులు చేయించడంతో పాటు.. పైకం తీసుకోవడంలో కూడా సారువారి హ్యాండ్ సూపర్ స్పీడ్ అట. ఎమ్మెల్యే పేరు చెప్పి పనులు చేయించుకోవడం.. కమిషన్ తీసుకోవడం సూపర్ గా నడుస్తోందంట. ఇది చూసిన మిగతా పీఏ లు కూడా దుకాణాలు ఓపెన్ చేసి.. పనికి ఇంత అంటూ రేట్ కట్టేసి.. పుల్లుగా వెనకేసుకుంటున్నారట.అంతే ఇక. లీడర్లు కూడా పీఏలనే బాస్ లుగా చూడాల్సిన పరిస్థితి. మామూలుగా లోకల్ లీడర్లు కూడా చాలా బలంగా ఉంటారు. డబ్బులు.. పొలాలు ఆస్తులు ఈ విషయాల్లో మంచి పవర్ ఉంటుంది. కానీ.. వాళ్లు కూడా పీఏలతో కలవక తప్పడం లేదట. ఇంకేముంది చెప్పండి. పీఏలపై లోకల్ లీడర్లు చాలా సీరియస్ గా ఉన్నారట. ఏందిరా నాయనా ఈ పీఏల పెత్తనం అని.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లినా ఎలాంటి ఉపయోగం లేదట. ఇక పెద్దలకి కూడా చెబుతున్నారట. ఈ పీఏలే ఎమ్మెల్యేల కంటే ఎక్కువ చేస్తున్నారు అని.. కక్కలేక మింగలేక చస్తున్నారట లోకల్ లీడర్లు.