విజయనగరం టీడీపీలో పాలిటిక్స్ మొదలయ్యాయి. రెండు వర్గాలుగా చీలి పోతున్నారు లీడర్లు. అశోక్ గజపతి రాజు.. మీసాల గీతల వర్గాలుగా విడిపోతున్నారు. రీసెంట్ గా మీసాల గీత పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడంతో ఈ ఎవ్వారం మరోసారి తెరపైకి వచ్చింది.మామూలుగా విజయనగరం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కు అంటే అశోక్ గజపతి రాజు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు కూడా అశోక్ గజపతి రాజు.. మీసాల గీత కలిసి కట్టుగానే పని చేశారు. ఇద్దరూ ఒకే చోట పోటీ చేసి.. ఎంపీగా గజపతి రాజు.. ఎమ్మెల్యేగా మీసాల గీత గెలిచారు. కానీ.. పోయిన ఎన్నికల్లో మీసాల గీతకు కాకుండా.. తన కుమార్తె.. అదితి కి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించారు అశోక్ గజపతి రాజు. అప్పటి నుంచి వీళ్లిద్దరికీ ప్రాబ్లమ్ వచ్చింది. పార్టీ ఆఫీస్ కూడా అశోక్ గజపతి రాజు ఇల్లే అన్నట్లుగా ఉండేది. అందుకే.. తనకి ఇంపార్టెన్స్ ఉండడం లేదని.. ఇన్ఫర్మేషన్ కూడా అందడం లేదని.. మీసాల గీత పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆ పార్టీలోని కొందరు లీడర్లు.. ఈ ఆఫీస్ ఓపెనింగ్ కి వచ్చారు. జిల్లాలో పార్టీ కార్యాలయం లేక పోవడం వల్ల.. పార్టీ ఉనికి పోతుంది అనే భావనతోనే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాం అన్నారు మీసాల గీత.
కానీ.. ఇంటర్నల్ గా మాత్రం పాలిటిక్స్ వేరే వేరే ఉన్నయ్. లోకల్ బాడీ ఎన్నికల విషయంలో కూడా అశోక్ గజపతి రాజు.. మీసాల గీతపై చాలా ఆరోపణలు చేస్తున్నారట. ఇండైరెక్ట్ గా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారట. ఇలాంటి మాటల వల్లే తాను పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాల్సి వచ్చిందని.. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత చెప్పుకుంటున్నారట. ఆమె వర్గం కూడా ఇదే మాట చెబుతోందంట. అసలే పార్టీ కష్టాల్లో ఉంటే.. వీళ్లిలా రెండు వర్గాలుగా చీలితో ఎలా అంటున్నారు టీడీపీ సీనియర్లు. మరి ఈ వివాదాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే క్లియర్ చేయగలరని మాట్లాడుకుంటున్నారు.