YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆళ్ల నానికి బ్యాడ్ టైం...

 ఆళ్ల నానికి  బ్యాడ్ టైం...

పాపం మినిస్ట‌ర్ ఆళ్ల నాని. ఏపీ మినిస్ట్రీల్లో.. ఎప్పుడూ ఫుల్ గా ట్రాజెడీ స్టోరీ ర‌న్ అవుతున్న శాఖ ఏదైనా ఉందంటే.. మంత్రి ఆళ్ల‌నాని చూసుకుంటున్న ఆరోగ్య శాఖ‌నే. ప్ర‌జ‌ల ఆరోగ్యానికి సంబంధించింది కావ‌డంతో.. ఎప్పుడూ అల‌ర్ట్ గా ఉండాలి. కానీ.. వ‌చ్చిన కాడ్నుంచే క‌రోనా వ‌చ్చేసింది. కొన్నాళ్లకే దండ‌యాత్ర చేసింది. దీంతో ఆళ్ల‌కి ప్రాబ్ల‌మ్ వ‌చ్చి ప‌డింది. చీఫ్ మినిస్ట‌ర్ త‌ర్వాత‌.. గ‌ట్టిగా మాట్లాడితే చీఫ్ మినిస్ట‌ర్ కంటే ఎక్కువ వ‌ర్క్ లోడ్ ఆళ్ల‌ నానిపైనే ప‌డింది క‌రోనాని ఎదుర్కోవ‌డం అంటే ఆషామాషీ కాదు అని అంద‌రికీ తెలిసిందే. కానీ.. ఫెయిల్యూర్ రిమార్క్ మాత్రం మినిస్ట‌ర్ పైనే ప‌డుతుంది. ఇప్ప‌టికీ కరోనా కంట్రోల్ కావ‌డం లేదు. దేశ వ్యాప్తంగా ఎక్కువ క‌రోనా కేసులు న‌మోదైన మూడవ రాష్ట్రంగా ఉంది ఏపీ. దాన్ని ఎదుర్కోవ‌డానికి శాయ శ‌క్తులా కృషి చేసినా.. ఆళ్ల‌నానికి పెద్ద‌గా ఒరిగిందేమీ లేదు.
ఇప్పుడేమో ఈ ఏలూరు హెల్త్ ఇష్యూ వ‌చ్చి పడింది. ఎందుకు ఎవ‌రికి వంట్లో బావుండ‌డం లేదో.. ఎప్పుడు ఎవ‌రు కుప్ప కూలిపోతారో అర్దం కాక‌.. పాపం మినిస్ట‌ర్ కి రాత్రిళ్లు నిద్ర ప‌ట్టిందో లేదో. ఇంకా అదే సిచ్చువేష‌న్ ఉంది అక్క‌డ‌. పూర్తి క్లారిటీస్ అయితే లేవు. బాధితుల హెల్త్ ఎప్పుడు రిక‌వ‌ర్ అవుతుందో కూడా తెలీదు.
మ‌రి ఇలాంటి ప్రాబ్ల‌మ్స్ ఉంటుంటే.. ఫెయిల్యూర్ రిమార్క్ ఆటోమేటిగ్గా ఉంటుంది క‌దా. మామూలుగా మినిస్ట‌ర్లు త‌మ శాఖ‌ల్ని డీల్ చేయ‌డంలో ఫెయిల్ అయినా.. ఏదైనా సీరియ‌స్ ఇన్సిడెంట్ జ‌రిగినా.. రాజీనామా చేస్తుంటారు. ఇది నా ఫెయిల్యూరే.. దీనికి బాధ్య‌త తీసుకుంటూ రిజైన్ చేస్తున్నా అంటారు. వాళ్లంత‌ట వాళ్లు రిజైన్ చేయ‌క‌పోయినా చుట్టూ ఉన్న‌వాళ్లంతా.. మ‌ర్యాద‌గా ఉంటుంది చేయండి అని ఫోర్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఆళ్ల‌నాని కూడా ఇదే పొజిష‌న్ లో ఉన్నారు. చూస్తుంటే.. ఇంకొన్నాళ్ల‌లో మినిస్ట్రీ పోతుంది అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నార‌ట చాలామంది. ఆ ప‌ద‌వి కోసం అదే పార్టీలో లీడ‌ర్లు కూడా వెయిటింగ్ అట‌. ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్ అయింది.

Related Posts