YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

వింత వ్యాధిపై రాని క్లారిటీ

వింత వ్యాధిపై రాని క్లారిటీ

ఏలూరు మిస్టరీ వ్యాధిపై వివిధ వైద్య బృందాలు వివిధ కారణాలు వెల్లడిస్తూ అసలు కారణం తేలడానికి కాస్త సమయం పడుతుందని స్పష్టం చేశారు. నీటి వల్లే కాలుష్యం ప్రబలి ఈ ఉత్పాతం సంభవించిందా.. కార్తీక మాసం నేపథ్యంలో ప్రజలు అధికంగా వాడే కూరగాయల్లో రసాయనాల ప్రభావంతో ఇలా జరిగిందా.. కోవిడ్ నివారణా చర్యల్లో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలకోసం అధికంగా వినియోగించిన బ్లీచింగ్, క్లోరిన్‌ల ప్రభావం దీనికి తోడయిందా.. బ్యాటరీలను డంప్ చేయడం వల్ల భూమిలో లెడ్ కలిసి విషతుల్యమైందా, లేదా వాటిని కాల్చడం వల్ల గాలిలో కలిసిపోయి మిస్టరీ వ్యాధి ప్రబలిందా అనే పలు అంశాలపై ఒక్కొక్క బృందం ఒక్కో రకంగా చెబుతుండటంతో సామాన్యులకు ఏమీ పాలుబోవడం లేదు.
కాగా ఢిల్లీ ఎయిమ్స్ నిపుణులు మరో కారణం చెబుతున్నారు. ఏలూరులో అస్వస్థతకు గురైన వారి రక్తంలో సీకం, నికెల్ అధికంగా కనిపిస్తున్న మాట వాస్తవమే కానీ భారతీయుల్లో సహజంగానే నికెల్ ఎక్కువగా ఉంటుంది దీనిపై పెద్దగా ఆందోళన చెదాల్సిన పని లేదని చెప్పారు. మిస్టరీ వ్యాధికి గురైనవారు కాస్త కోలుకుంటుండగా వారి శరీరాల్లో సీసం స్థాయి బాగా తగ్గుముఖం పట్టినట్లు తేలిందని, వీలైనంత త్వరలో కారణాలపై స్పష్టమైన నిర్ధారణకు వస్తామని వీరు చెప్పారు.
ప్రధానంగా వేర్వేరు మార్గాల్లో మనుషుల శరీరాల్లో ప్రవేశించిన సీసం వల్ల కానీ, పురుగు మందలు ద్వారా ఆర్గానిక్ క్లోరైడ్స్ కలుషితమైనందున గానీ ఏలూరు వాసులు ఇంత ఎక్కువగా అస్వస్థత పాలై ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇక హైదరాబాద్ ఎన్ఐఎన్ నిపుణులు ఏలూరు పట్టణంలో అయిదు ప్రాంతాల్లో ఇల్లిల్లూ తిరిగి, బాథితులు తీసుకున్న ఆహారం వివరాలు తెలుసుకున్నారు. కూరగాయలు, రక్తం, మూత్రం నమూనాలు, చికిత్స పొందుతున్న వారి శాంపుల్స్ కూడా తీసుకున్నారు. సమగ్ర పరీక్షలు చేస్తున్నాం. ప్రస్తుతానికైతే ప్రమాదకర స్థాయిలో సంకేతాలు కనిపించ లేదని వీరు స్పష్టం చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం బాధితులు తీసుకున్న ఆహారంతో పాటు ఆరోగ్యపరమైన వివరాలు నమోదు చేస్తున్నామని, ఈ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపింది.
బుధవారం రాత్రి 10 గంటల వరకు రోజంతా ఏలూరు పట్టణంలో 20 కేసులే నమోదు కావడంతో అయిదు రోజుల తర్వాత పట్టణం కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. రాత్రి సమయానికి ఆసుపత్రిలో 42 మంది బాధితులు మాత్రమే చికిత్స పొందుతున్నారని, ఇప్పటివరకు 563 మంది డిశ్చార్జ్ అయ్యారని ఏలూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి వివరించారు

Related Posts