YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

రాహుల్ కు మళ్లీ పగ్గాలు

రాహుల్ కు మళ్లీ పగ్గాలు

రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ కూటమిలోని కొన్ని పార్టీలు అంగీకరించేందుకు సిద్ధంగా లేవు. రాహుల్ ప్రధాని మోదీకి ధీటైన నేతకాదన్న అభిప్రాయం వారు వ్యక్తం చేస్తుండటం విశేషం. త్వరలోనే రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు. ఇన్నాళ్లూ దీనిపై నాన్చిన రాహుల్ గాంధీ నేతల వత్తిడి మేరకు ఎట్టకేలకు అంగీకరించారు. త్వరలో సమావేశం కానున్న ఏఐసీసీ రాహుల్ గాంధీని తమ నేతగా ఎన్నుకోనుంది.అయితే రాహుల్ గాంధీని జాతీయ నేతగా అంగీకరించేందుకు కొందరు ఇష్టపడటం లేదు. ప్రధానంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాహుల్ గాంధీని జాతీయనేతగా అంగీకరించ లేమని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ఆయనకు స్థిరత్వం లేదన్నది శరద్ పవార్ చేసిన వ్యాఖ్య. నిజమే ఇదే అభిప్రాయాన్ని పార్టీలోని సీనియర్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు.ఏదైనా పార్టీకి నాయకత్వం వహించే వారు గెలుపోటములను స్వీకరించాలి. కానీ రాహుల్ గాంధీకి ఆ నైజం లేదు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలుకాగానే అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. దాదాపు ఏడాదిన్నరగా ఆ పదవి ఖాళీగానే ఉన్నట్లు లెక్క. ఒక జాతీయ పార్టీకి నాయకత్వాన్ని లేకుండా చేశారన్న అపవాదును రాహుల్ గాంధీ మూట గట్టుకున్నారు. ఓటమి పాలయినా క్యాడర్ ను ఉత్తేజ పర్చాల్సిన సమయంలో రాహుల్ గాంధీ కాడిని వదిలేశారన్న విమర్శలు సొంత పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.ఇప్పుడ శరద్ పవార్ కూడా అదే చెప్పారు. సీరియస్ గా ఉన్న సయమంలో రాహుల్ గాంధీ విదేశీ టూర్లు పెట్టుకుంటారు. ఎన్నికల సమయంలో తప్పించి పెద్దగా యాక్టివ్ గా కన్పించరనేది రాహుల్ గాంధీపై మరో ఆరోపణ. అందుకే ఆయనను స్థిరత్వం లేని నేతగా శరద్ పవార్ అన్నారంటున్నారు. సోనియాగాంధీ అనారోగ్యం పాలయిన తర్వాత పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టినా దేశ వ్యాప్తంగా క్యాడర్ లో నమ్మకం రాహుల్ గాంధీ కలిగించలేకపోయారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ తన తీరును మార్చుకుంటే బాగుంటుందన్నద సూచనలు వెలువడుతున్నాయి.

Related Posts