YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం తెలంగాణ

కార్గో సక్సెస్సేనా

కార్గో సక్సెస్సేనా

కార్గో బిజినెస్.. ఎన్నో సంస్థలు బాగా క్లిక్ అవ్వడమే కాకుండా ఎంతో మందికి ఉపాధిని అందిస్తూ వస్తున్నాయి. తాజాగా తెలంగాణ ఆర్టీసీ కూడా కార్గో సర్వీసులు మొదలు పెట్టింది. నేటి నుంచి ఇంటికే పార్శిళ్ల పంపిణీ చేయనున్నారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో 'టీఎస్ఆర్టీసీ పార్శిల్ - హోమ్ డెలివరీ' సేవలు ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. 3 నెలల పాటు ప్రయోగాత్మకంగా సేవలు అందించనున్నారు.
విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. డోర్‌ టూ డోర్‌ సేవల కోసం మూడు సంస్థలను ఇప్పటికే అధికారులు ఎంపిక చేశారు. నగరాన్ని మూడు సెక్టార్లుగా విభజించి ఆయా సంస్థలకు అప్పగించింది. నేరుగా వినియోగదారుడి ఇంటికే ఆర్టీసీ పార్శిల్‌ కార్గో సేవలు అందనున్నాయి. డోర్‌ డెలివరీ సేవలతో ఆర్టీసీ రోజుకు మరో రూ.13లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. తొలిదశలో జంట నగరాల్లో హోమ్ డెలివరీ సర్వీసులు ప్రారంభిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పట్టణాలకు, మండల కేంద్రాలకు కూడా ఈ సర్వీసులను అందించనున్నారు.
లాక్ డౌన్ సమయంలో ఆర్టీసీ కూడా పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయింది. మరో వైపు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకుని వస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఇలాంటి తరుణంలో ఆర్టీసీ కార్గో సేవలు తెలంగాణ ఆర్టీసీకి ప్లస్ అవుతాయనే అనుకుంటూ ఉన్నారు. ఇతర కార్గో సేవలతో పోలిస్తే ఆర్టీసీ కార్గో సేవల ధరలు కాస్త తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది ఈ సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది.

Related Posts