తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. వైకుంఠ ఏకాదశి ఆన్‌లైన్ కోటా విడుదలైంది. భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశి సందర్బంగా డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 11న శుక్రవారం ఉదయం 6.30 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. పుష్యమాసంలో వచ్చే శుక్షపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజు ఉత్తర ద్వారంలో శ్రీమహావిష్ణువును దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే.. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ రోజున ప్రముఖ వైష్ణవాలయాలలో ఉత్తరద్వారం నుంచి మాధవుడిని భక్తులు దర్శించుకుంటారు. ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పర్వదినమని భక్తుల నమమ్మకం. ఉత్తరద్వార దర్శనం కోసం భక్తకోటి నిరీక్షించే సమయం శ్రీరంగం వంటి ప్రముఖ వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి మొదలు పది రోజులపాటు ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు.