YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రోడ్లకోసం ధర్నా

రోడ్లకోసం ధర్నా

తమ ప్రాంతంలో సరైన రోడ్లు,డ్రైన్లు లేక తామంతా  అనేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ పిఠాపురం పట్టణం 2,3,4 వార్డులకు సంబంధించిన ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారంతా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన,నిరసన కార్యక్రమం చేపట్టారు.వెంటనే తమ ప్రాంతంలో రోడ్లు,డ్రైన్లు నిర్మించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం అనంతరం కమిషనర్ రామ్మోహనరావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ప్రజాసంఘ నాయకులు కరణం విశ్వనాథం మీడియాతో మాట్లాడుతూ.,ఏళ్లతరబడి నివసిస్తున్నా తమ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలుకూడా లేవని,తమను పట్టించుకునే నాథుడే  కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో కూరాకుల సింహాచలం,కోనేటి రాజు,రామకృష్ణ,సత్తిబాబు,మారోజు వీరబాబు,గౌతు రామారావు,బండి కృష్ణమూర్తి,దొడ్డి వెంకటరమణ,అలుగోలు రాంబాబు,వెంకటరమణ,అమర్నాథ్,శివ,రవి,స్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Posts