భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే ఓ సంఘటన కర్ణాటకలో జరిగింది. ఓ ముస్లిం వ్యక్తి హిందూ దేవాలయం కోసం రూ.కోటి విలువ చేసే భూమిని ఉచితంగా అందించాడు. మతమేదైనా అందరూ సమానమేనని చాటి చెప్పాడు. హోసకోట్ తహసీల్ కదుగోడిలోని బెలాతుర్ కాలనీకి చెందిన హెచ్ఎమ్జీ బాషా తన 1.633 చదరపు అడుగుల భూమిని వీరాంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్కు ఉచితంగా అందించారు. ఆలయానికి వచ్చిన భక్తులు గుడి ప్రదర్శణ చేస్తునప్పుడు స్థలం ఇరుకుడా వుండేది. అది గమనించి పక్కనే వున్న తన భూమిని ఇవ్వాలని నిర్ణయించుకున్నానని భాష అంటున్నారు. ఈ ఆలయం బెంగళూరు నుంచి చెన్నైకు వెళ్లే జాతీయ రహదారి మధ్యలో ఉంది. తనకు మందిరమైనా, మసీదు అయినా ఒకలాంటిదేనని చెబుతున్నారు బాషా.