YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

చిన్నమ్మకు మరో కష్టం

చిన్నమ్మకు మరో కష్టం

దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అఫడవిట్ లో అడ్డంగా దొరికిపోయినట్లయింది.తనను చో రామస్వామి కారణంగానే జయలలిత బయటకు పంపారని, అయితే తర్వాత జయలలిత తన తప్పు ఏమీ లేదని తెలుసుకుని పోయెస్ గార్డెన్ కు ఆహ్వానించారని చెప్పారు. శశికళ ప్రత్యేకంగా చెప్పడాన్ని అన్నాడీఎంకే నేతలు గుర్తు చేస్తున్నారు. 2011లో పోయెస్ గార్డెన్ నుంచి తనకు బయటకు పంపిన జయలలిత తన తప్పులేదని తెలిసి తిరిగి పిలిపించారన్నారు. అయితే అప్పుడు తాను జయలలితకు ఒక లేఖ రాసిచ్చానని పేర్కొన్నారు. చో రామస్వామి కారణంగానే ఆ లేఖ రాయాల్సి వచ్చిందన్నారు. తాను రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోనని, తన కుటుంబాన్ని దరి చేరనీయనని కూడా లేఖ రాసిచ్చిన తర్వాతే పోయెస్ గార్డెన్ లోకి అడుగుపెట్టానని కమిషన్ కు పంపిన అఫడవిట్ లో శశికళ పేర్కొన్నారు. దీంతో అధికార పార్టీ పండగ చేసుకుంటోంది. జయలలిత మృతిపై మిస్టరీని తొలగించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామితో తమిళనాడు ప్రభుత్వం కమిషన్ ఏర్పాుట చేసింది. అన్నాడీఎంకే విపరీతంగా ప్రచారం చేస్తుంది. అమ్మ జయలలితకు రాజకీయాల్లో జోక్యం చేసుకోనని చెప్పి, ఆమె చనిపోగానే పార్టీ పదవిని ఎందుకు చేపట్టాల్సి వస్తుందని ప్రశ్నించారు. అలాగే కుటుంబ సభ్యులను దూరంగా ఉంచుతానని జయలలితకు లేఖ రాసిచ్చి, ఆమె మరణించగానే కుటుంబం మొత్తాన్ని పోయెస్ గార్డెన్ కు ఎందుకు తరలించాల్సివచ్చిందో శశికళ చెప్పాలని అధికార అన్నాడీఎంకే నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద శశికళ అఫడవిట్ అధికార అన్నాడీఎంకేకు అస్త్రంలా దొరికింది. ఆమెను, ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి గెంటేయడం కరెక్టేనన్న విషయం ఈ అఫడవిట్ స్పష్టం చేస్తుందంటున్నారు రెండాకుల పార్టీ నేతలు.ఈ కమిషన్ జయలలిత మృతికి సంబంధించి అందరినీ విచారించారు. అపోలో ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, జయలలితకు సన్నిహితులను కమిషన్ విచారించింది. అయితే జయ మృతిపై కీలక సమాచారాన్ని రాబట్టాలంటే శశికళను విచారించాలి. కాని శశికళ అక్రమాస్తుల కేసులో పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కమిషన్ ఎదుటకు శశికళ రాలేని పరిస్థితి. శశికళ తన న్యాయవాది ద్వారా జయ మృతి చెందిన సమయంలోనూ, అంతకు ముందు జరిగిన విషయాలను అఫడవిట్ రూపంలో కమిషన్ కు తన న్యాయవాది ద్వారా పంపారు. అయితే అఫడవిట్ లో శశికళ పేర్కొన్న అంశాలు తాజాగా బయటకు వచ్చాయి. ఇందులో 

Related Posts