తిరుమల శ్రీవారిని బిజెపి ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు . మొక్కులు చెల్లించుకున్నారు. అయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామి వారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల బిజెపి ఏపీ ఇన్చార్జ్ సునీల్ దియోధర్ మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి త్వరగా విముక్తి పొంది విశ్వమానవాళి ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. తిరుమల పరమపవిత్ర పుణ్యక్షేత్రంమని ఇక్కడ రాజకీయాలు మాట్లాడం సరికాదు అన్నారు తిరుపతి ఉపఎన్నికల పై తిరుపతిలో మీడియాతో మాట్లాడతానని తెలిపారు.