భార్య పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబ సభ్యురాలికి ఉద్యోగ నియామక పత్రాన్ని జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ అందజేసారు. శుక్రవారం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో అబ్దుల్ సలాం సమీప బంధువు రేష్మ కి పశుసంవర్ధక శాఖ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా నియమాకపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి. రమణయ్య, డిడి లు డాక్టర్ సివి రమణయ్య , డాక్టర్. నరసింహారావు హజరయ్యారు.
జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ నవంబర్ నెల 20 వ తేదీ ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి పుష్కరాల సందర్భంగా కర్నూల్ లో పర్యటించిన సందర్భంలో సలాం కుటుంబ సభ్యులు అయనను కలిసారు. వారి కోరిక మేరకు ఈ ఉద్యోగం కల్పించామని అన్నారు. నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం అబ్దుల్ సలాం బంధువు
షేక్షావలినీ రాయదుర్గం నుండి నుండి నంద్యాల పి హెచ్ సి కి బదిలీ చేయించారని, కుటుంబ సభ్యులలో ఒకరైన రేష్మా కి ఆర్లగడ్డ యందు పశుసంవర్ధక శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గానియామక పత్రాన్ని కూడా అందజేశామన్నారు. ప్రభుత్వం ఎప్పుడు ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుతుందని ఆయన అన్నారు.